Most Expensive Lehenga : వజ్రాల లెహంగా, ధర వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే

ముఖేష్ అంబానీ నీతాల ముద్దుల కూతురు ఇషా అంబానీ పెళ్లిలో ధరించిన లెహంగాను మించిన లెహంగా ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే.

Most Expensive Lehenga : వజ్రాల లెహంగా, ధర వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే

World Most expensive Lehenga

Most expensive Lehenga : ముఖేష్ అంబానీ నీతాల ముద్దుల కూతురు ఇషా అంబానీ పెళ్లి నభూతో నభవిష్యతి అనే రీతిలో జరిగింది. అంబానీ ఇంట ఏ వేడుకు జరిగినా అలాగే ఉంటుంది. వేడుల్లో అంబానీ కుటుంబ సభ్యులు ధరించే డ్రెస్సుల నుంచి భోజనాలు, అరేంజ్ మెంట్ అన్ని అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. వారి ఇంట్లో వినాయక చవితి పండగ జరిగినా ప్రముఖులు అంతా కుటుంబాలతో సహాయ విచ్చేస్తారు.ఇక అక్కడి వాతరం అంతా అత్యంత ఖరీదుగా ఉంటుంది. దర్పం, రాజసం ఉట్టిపడేలా దుస్తులు కళ్లు చెదిరేలా కనువిందు చేస్తాయి. సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతుంటాయి.

ఇషా అంబానీ పెళ్లి డ్రెస్‌ అప్పట్లోనే కాదు ఈనాటికి ట్రెండ్ గానే ఉంటుంది. అసలు ఆమె ధరించిన డ్రెస్ ను మించినది ఎవ్వరు ధరించరని అసలు తయారీయే ఉండని దటీజ్ ఇష్టా అంబానీ డ్రెస్ అనే రీతిలో మారుమోగిపోయింది ఆమె ధరించి వెడ్డింగ్ డ్రెస్ లెహంగా. ఆ లెహంగా కోసం ఏకంగా రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లుగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ లెహంగాను మించినది..ఖరీదైనది బహుశా ఉండదేమో అనుకున్నారు అంతా. ఇషా ధరించి లెహంగా ప్రపంచంలోనే ఖరీదైన లెహంగా అప్పట్లోనే కాదు ఇప్పటికీ పేరుండిపోయింది.

Azature : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్.. దీని కాస్ట్‌తో మూడు బెంజ్ కార్లు కొనొచ్చట

కానీ దానికి తలదన్నేలా ఓ లెహంగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఇషా లెహంగా రికార్డును బ్రేక్ చేసేలా మరో లెహంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇషా ధరించిన లెహంగా బంగారంతో తయారు చేయించారట. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ లెహంగా దానిని మించి అన్నట్లుగా ఉంది. ఈ లెహంగాను డైమండ్స్‌తో తయారు చేశారట. ఈ లెహంగాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వరించింది.

గిన్నిస్ రికార్డు ప్రకారం.. బ్రైడల్ డిజైనర్ రెనీ, ప్రఖ్యాత జ్యువెలర్ మార్టిన్ కాట్జ్ తయారు చేసిన ఈ డైమండ్ వెడ్డింగ్ డ్రెస్ ప్రపంచంలోనే అత్యంత క్లాస్ట్లీ వెడ్డింగ్ డ్రెస్ అట. అంతేకాదు ఇది చాలా చాలా అందమైన లెహంగా కూడా. ఈ లెహంగాను అత్యంత నాణ్యమైన పట్టుతో తయారు చేశారు. 150 క్యారెట్ల వజ్రాలతో తయారు చేశారు. దీని ధర 12 మిలియన్లు..! ఇది భారతీయ కరెన్సీలో రూ. 99.85 కోట్లు.కాలిఫోర్నియాలోని విలాసవంతమైన రిట్జ్ కార్ల్టన్ హోటల్‌ (NMACC)లో డిజైనర్ ద్వయం వివాహ గౌనును ఆవిష్కరించారు. ఈ రూ. 99.85 కోట్ల విలువైన ఈ లెహంగా ఎవరిని సొంతం చేసుకుంటుందో చూడాలి.