Pulse Polio
Pulse Polio: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని.. తల్లిదండ్రులు బాధ్యతగా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్కులో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్ ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కరోనా కారణంగా గత రెండేళ్లుగా పల్స్ పోలియో వాయిదా వేసుకున్నామని.. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల సెంటర్లలో పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని మంత్రి హరీష్ సూచించారు.
Also read: India Covid-19 Update : దేశంలో కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదు
తెలంగాణలో 28 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని..అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5ఏళ్ళ పిల్లల వరకు అందరికి పోలియో చుక్కలు వేయించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా పాక్షికంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Also read: AP Government : కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు.. ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ
ఇక తెలంగాణలో ఆరోగ్యరంగంలో చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజారోగ్యంలో ఏ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ ముందుంటుందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని అన్నారు. తెలంగాణలో పేదల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని.. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లోనూ బస్తీ ధవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు వివరించారు. బస్తీ ధవాఖానాలు ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. వైద్య సేవలతో పాటు, మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. వీలును బట్టి సాయంత్రం వేళలలోనూ బస్తి ధవాఖానాలు తెరవాలని అధికారులకు సూచించినట్లు మంత్రి వివరించారు.
Also read: Pulse Polio : నేడు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో.. ఐదేళ్లలోపు పిల్లలందరికీ