Harish Rao : కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే – హరీష్ రావు

ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.

Harish Rao : ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్‌, కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేని ఆయన విమర్శించారు. మంగళవారం నారాయణఖేడ్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.

Also Read : CM KCR : బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెబితే కిషన్‌రెడ్డి సిపాయే : సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్ హయాంలో కొనుగోళ్లు కేంద్రాలెన్ని, టీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలెన్నో లెక్క తేల్చుకుందామా అని సవాల్‌ విసిరారు. సంగారెడ్డి జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామనివీటిద్వారా జిల్లాలో 70 శాతం కొనుగోళ్లు పూర్తి చేశామని, మిగిలిన 30 శాతం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు.

Also Read : CM KCR : యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు – సీఎం కేసీఆర్

బీజేపీ, కాంగ్రెస్‌కు కొనుగోలు పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు హరీష్. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్‌ వైఖరి ఒకలా.. కిషన్ రెడ్డి మాటలు మరోలా ఉన్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ప్రభుత్వం ఒక లెటర్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 70 ఏండ్లు అధికారం ఉన్న కాంగ్రెస్ తాగునీరు, సాగు నీరు అందిచలేదని విమర్శించారు.

సింగూర్ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ పెట్టి సంగారెడ్డి జిల్లాకు నీరు అందిస్తున్నామని తెలిపారు హరీష్ రావు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదగా పనులు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

minister harish rao,  bjp and congress,  paddy purchase

ట్రెండింగ్ వార్తలు