CM KCR : యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు – సీఎం కేసీఆర్

కేంద్రప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనేందుకు ముందుకు రావడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.

CM KCR : యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు – సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR : కేంద్రప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనేందుకు ముందుకు రావడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ వరి ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడారు. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు కేసీఆర్. కేంద్రప్రభుత్వం బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదని స్పష్టం చేశారు కేసీఆర్. తెలంగాణలో యాసంగి వచ్చే వడ్లతో రారైస్ తీయసం సాధ్యం కాదని.. తెలిపారు. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వర్షాకాలం వడ్లను రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

చదవండి : CM KCR : నాలుగో రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్.. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు

కేంద్రప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్రం వైఖరిని తెలంగాణ రైతులు గమనిస్తున్నారని అన్నారు. బీజేపీ పరిపాలనలో దేశం ప్రతిష్ట దిగజారుతుందని కేసీఆర్ తెలిపారు. గ్లోబల్ హాంగర్ ఇండెక్స్‌లో భారత కంటే పక్కన ఉన్న దేశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. గట్టిగా మాట్లాడితే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను కట్ చేస్తారని మండిపడ్డారు. దేశంలో రైతులు బాగుండాలి అంటే బీజేపీ ప్రభుత్వం పోవాలని వ్యాఖ్యానించారు

చదవండి : KCR : సభలో సమరమే.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం