CM KCR : గులాబీ బాస్ ఒత్తిడికి కేంద్రం దిగివస్తుందా? | Telangana CM KCR to meet Union Minister Gajendrasingh Shekhawat

CM KCR : గులాబీ బాస్ ఒత్తిడికి కేంద్రం దిగివస్తుందా?

ఢిల్లీలో మ‌కాం వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం పెండింగ్ స‌మ‌స్యల‌తో పాటు ట్రైబ్యునల్‌ అంశంలో సీరియ‌స్ గా ఉన్నారు. నీటి వాటాలు తేల్చకుండా ప్రాజెక్టుల‌పై పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.

CM KCR : గులాబీ బాస్ ఒత్తిడికి కేంద్రం దిగివస్తుందా?

CM KCR delhi tour : మా స‌హనాన్ని ప‌రిక్షించొద్దు.. ఓపికకు కూడా ఓ హ‌ద్దుంటుంది. త‌క్షణ‌మే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల‌న్న తెలంగాణ సీఎం.. హ‌స్తిన బాటప‌ట్టారు. దీంతో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం ఏం చేయ‌బోతుంది..? గులాబీ బాస్ ఒత్తిడికి దిగివస్తుందా? ఇంత‌కు కొత్త ట్రైబ్యునల్‌పై ప్రధాని మదిలో ఏముంది? ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ, ఏపీ నీటి పంచాయితీ తెగడం లేదు. ఏపీలో సీఎం వైఎస్.జగన్ అధికారంలోకి వచ్చాక… మొదట్లో కేసీఆర్‌తో దోస్తీ కట్టారు. అంతా సాఫిగా సమస్యలు పరిష్కారం అవుతుందనుకున్న సమయంలో ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది. దీంతో ఏపీ, తెలంగాణ నీటి పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఇరు రాష్ట్రాల మధ్య నీటి మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి.

Kondapalli Municipal : నేడే కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

ఏపీ, తెలంగాణ ఆరోప‌ణ‌లు, ప్రత్యారోప‌ణ‌లతో కేంద్రం రంగంలోకి దిగి… గెజిట్ అస్త్రాన్ని తెర మీద‌కు తెచ్చింది. రెండు రాష్ట్రాల్లోని అన్నీ ప్రాజెక్టుల‌ను గెజిట్ పరిధిలోకి తీసుకువచ్చి.. ప్రాజెక్టుల‌ను త‌మ ఆధీనంలోకి తీసుకుంది కేంద్రం. అక్టోబ‌ర్ 14 నుంచి గెజిట్ అమ‌లు అవుతున్నా.. తెలంగాణ కొత్త ట్రైబ్యునల్‌ డిమాండ్‌తో కేంద్రం దూకుడుకు బ్రేకులు వేసింది.

కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా ఎలా గెజిట్ అమ‌లు చేస్తారని ప్రశ్నిస్తోంది తెలంగాణ సర్కార్. గ‌తంలో బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ ప్రకారం ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టిఎంసీల‌లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ‌కు 299 టీఎంసీలు నీటివాటా అమ‌లవుతోంది. ఈ వాటా స‌రైంది కాద‌ని వాదిస్తోంది తెలంగాణ‌. ఈ వాటాల‌ను పునఃప‌ంపిణీ చేసేందుకు కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరుతోంది తెలంగాణ సర్కార్. దీనిపై 2014 లోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది.

Kondapalli Municipal : కొండపల్లి మున్సిపల్‌ పంచాయితీలో కొత్త ట్విస్ట్‌

త‌క్షణ‌మే అంత‌రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం- 1956 లోని సెక్షణ్ -3 ప్రకారం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ వ‌స్తోంది. ట్రైబ్యునల్ ఏర్పాటుకు సుప్రీంకోర్టులో వేసిన కేసు అడ్డంకిగా ఉండడంతో.. గ‌తంలో అపెక్స్ కౌన్సిల్ ఆదేశాల‌తో సుప్రీంకోర్టులో ఉన్న కేసును కూడా ఉపసంహరించుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఇక కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాల‌ని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

ప్రస్తుతం ఢిల్లీలో మ‌కాం వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం పెండింగ్ స‌మ‌స్యల‌తో పాటు.. ట్రైబ్యునల్‌ అంశంలో సీరియ‌స్ గా ఉన్నారు. నీటి వాటాలు తేల్చకుండా ప్రాజెక్టుల‌పై పెత్తనం ఏంటీ అంటున్న గులాబీ బాస్.. స‌హ‌నాన్ని పరీక్షించ‌వ‌ద్దు అంటూ కేంద్రానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. కేంద్ర జ‌లవ‌న‌రులశాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ను క‌లిసి.. ట్రైబ్యున‌ల్ ఏర్పాటుపై వెంట‌నే నిర్ణయం తీసుకోవాల‌ని కోర‌నున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో కూడా దీనిపై చ‌ర్చించ‌నున్నారు. నీటి వాటాలు తేల్చకుండా నీళ్ళ పంచాయ‌తీ ఎలా ప‌రిష్కారం అవుతుంద‌ని.. దీనికోసం ట్రైబ్యునల్ ఏర్పాటే స‌రైన మార్గమని తెలంగాణ స‌ర్కార్ అంటోంది.

AP Assembly : కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం

కొత్త ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లుగా కోరుతున్నప్పటికి… కేంద్రం మాత్రం ఎలాంటి ముందడుగు వేయడం లేదు. దీంతో ఆఖరిగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రయత్నం చేయనున్నారు. మ‌రి గులాబి బాస్ ఒత్తిడికి కేంద్రం దిగొచ్చి.. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? లేక ఇలాగే ఏటు తేల్చకుండా నాన్చుతుందో చూడాలి.

×