AP Assembly : కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం

కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు..బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు.

AP Assembly : కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం

Jagan (1)

conduct BC census by caste : కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తెస్తున్నామన్నారు. బీసీల లెక్క తేలితేనే ప్రభుత్వాలకు స్పష్టత వస్తుందన్నారు. జనగణన లేకపోవడంతోనే బీసీలు వెనుకబడిపోయారన్నారు. సామాజికంగా, ఆర్థికంగా బీసీలకు న్యాయం జరగడం లేదు. బీసీల సంఖ్య తెలిస్తేనే వారికి న్యాయం జరుగుతుంది.

బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందన్నారు. కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు జగన్‌ తెలిపారు. బీసీలను సామాజికంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు నలుగురు సభ్యులను పంపించగా అందులో ఇద్దరు బీసీలున్నారు. శాసనసభ స్పీకర్‌ పదవిని కూడా బీసీ వ్యక్తికే కేటాయించామన్నారు.

Piyush Goyal : కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో ముగిసిన తెలంగాణ మంత్రులు భేటీ

శాశ్వత బీసీ కమిషన్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగామని చెప్పారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చామన్నారు. జడ్పీ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 69 శాతం ఇచ్చామన్నారు సీఎం. 13 మేయర్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 92 శాతం ఇచ్చామన్నారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 నామినేటెడ్‌ ఛైర్మన్ల పదవుల్లో బీసీలకు 53 ఇచ్చామని సీఎం తెలిపారు.