Kondapalli Municipal : నేడే కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

ఏపీలో కాకరేపుతున్న కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు ఇవాళ ఎండ్ కార్డ్ పడనుంది. కొండపల్లి పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనంటూ హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది.

Kondapalli Municipal : నేడే కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

Kondapalli (1)

Kondapalli Municipal Election : ఏపీలో కాకరేపుతున్న కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు ఇవాళ ఎండ్ కార్డ్ పడనుంది. కొండపల్లి పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనంటూ హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికను ఇవాళ నిర్వహించాలంటూ  హైకోర్టు అధికారులను ఆదేశించింది. పోలీస్‌ బందోబస్తు మధ్య ఎన్నిక జరపాలని సూచించారు. అసలు ఈ ఎన్నికను ఎందుకు నిర్వహించలేదంటూ కొండపల్లి మున్సిపల్ కమిషనర్‌, రిటర్నింగ్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైసీపీ నేతలు కౌన్సిల్ హాల్ లో దౌర్జన్యానికి దిగారంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. మరోవైపు ఎంపీ కేశినేని ఎక్స్‌ ఆఫిషియో ఓటు హక్కుపై కూడా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. కేశినేని నాని ఓటు వేసుకోవచ్చని వెల్లడించింది. అయితే ఆ ఓటు పరిగణనలోకి తీసుకోవాలా.. వద్దా.. అన్నది మాత్రం తాము నిర్ణయిస్తామంది.. అప్పటి వరకు ఫలితాలు మాత్రం విడుదల చేయవద్దని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.

AP Assembly : కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం

దీంతో ఇవాళ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. అయితే సజావుగా ఎన్నిక జరుగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇవాళ ఎన్నిక సజావుగా జరిగేలా పోలీసులు చూడాలని కోరారు.

హైకోర్టు ఆదేశాలతో మూడోసారి సమావేశం కానుంది. ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మొదటగా సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశానికి హాజరు కావాలంటూ ఎన్నికల అధికారి నుంచి కేశినేని నానికి ఆహ్వానం అందింది.

Rain Forecast : బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ తరఫున గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ, వైసీపీ క్యాంప్ రాజకీయాలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. గొల్లపూడి దేవినేని ఉమా నివాసంలో టీడీపీ క్యాంప్, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ స్వగ్రామం ఐతవరంలో వైసీపీ క్యాంప్ సాగుతున్నాయి.

కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. వీటిలో 14 వార్డులు టీడీపీ, 14 వార్డు లు వైసీపీ ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలుపొందారు. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీకి మద్దతు పలికారు. ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో ఓటుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎంపీ కేశినేని నానిని వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఆఖరి నిమిషంలో అధికారపక్షం ఎటువంటి ఎత్తులు వేస్తుందోనని టీడీపీలో టెన్షన్ నెలకొంది.