KCR : సభలో సమరమే.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన..

KCR : సభలో సమరమే.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

Kcr

KCR : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో కేసీఆర్ చర్చించారు. వారికి దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో ఉభయ సభల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయంపై చర్చించారు.

Stop Charging Phones : ఆఫీసులో మొబైల్ ఛార్జింగ్ పెడితే..జీతం కట్!

రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు విషయంలో పార్లమెంటు వేదికగా పోరాడాలని కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా వాణిని వినిపించాలన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలపై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంపీలతో చెప్పారు. అలాగే విద్యుత్ చట్టాల ఉపసంహరణపై పోరాటం చేయాలన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. కరెంట్ మీటర్ల బిగింపు విషయంపై పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు.

BSNL: బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లకు షాక్..

”తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు. పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల అంశంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదన్న విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలి. ఇప్పటికే చాలా ఓపికపట్టాం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి. బాయిల్డ్ రైస్ పై కేంద్రం వైఖరిపై నిలదీయాలి” అని ఎంపీలకు స్పష్టం చేశారు కేసీఆర్.

పంట కొనుగోలుకు జాతీయ విధానాన్ని ప్రకటించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. యాసంగిలో తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం లాంటి వాటి కోసం పోరాడాలని ఎంపీలకు సూచించారు. కృష్ణా జలాలు, నీటి విడుదల గెజిట్ అంశంపై పోరాడాలన్నారు. ఇంటా, బయట టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.