Harish Rao : 215 ఎకరాల్లో హెల్త్‌ సిటీ

ఆదివారం రాత్రి కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన వరంగల్‌ ఐఎంఏ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

Harish Rao :  వరంగల్‌ను మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం రాత్రి కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన వరంగల్‌ ఐఎంఏ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేఎంసీ, సెంట్రల్‌ జైలు, ఎంజీఎం, కంటి దవాఖానలకు సంబంధించిన 215 ఎకరాల స్థలంలో రెండువేల పడకల దవాఖానలు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్ అని.. ఇక్కడ హెల్త్ సిటీ నిర్మిస్తామని ప్రకటించారు.

చదవండి : Health Minister Harish Rao : రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి-హరీష్ రావు

1,200 పడకల దవాఖానలో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందిస్తామన్నారు. మరో 800 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మిస్తామని పేర్కొన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుచేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. 10 వేల కోట్లతో రాష్ట్రంలో వైద్యవ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్‌ కిట్‌లతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగి, ప్రైవేట్‌ దవాఖానల్లో తగ్గాయని వెల్లడించారు.

చదవండి : Harish Rao : ఎయిమ్స్‌కి భూమి, భవనం మేమే ఇచ్చాం.. కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించినప్పుడే డాక్టర్లకు గుర్తింపు వస్తుందన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, తాటికొండ రాజయ్య, ఐఎంఏ రాష్ట్ర అద్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు