Health Minister Harish Rao : రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి-హరీష్ రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

Health Minister Harish Rao : రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి-హరీష్ రావు

Health Minister Harish Rao

Health Minister Harish Rao :  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ల, డీఎంహెచ్ఓలు, ఇతర ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్, కొత్త మెడికల్ కాలేజీల్లో వసతుల కల్పన, ఆసుపత్రుల పనితీరుని మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ, ప్రవేటు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందిస్తున్న 946 రకాల వైద్యసేవలు  అమలు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కి అదనంగా ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను చేర్చినట్లు మంత్రి తెలిపారు.

Also Read: Girl Eloping With Lover : దారుణం : ప్రేమికుడితో పారిపోయిందని గుండు కొట్టించి మసిపూశారు 

సీఎం కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేశారని… అవసరం అయితే మరో 10 వేల కోట్ల రూపాయలను వైద్యానికి ఖర్చుచేయటానికి సీఎం సిధ్ధంగా ఉన్నారని హరీష్ రావు తెలిపారు.  తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు. ఇకనుంచి ప్రభుత్వాసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని… ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మెడికల్ కాలేజీలు…పెద్దాసుపత్రులు అన్నీ తనిఖీ చేస్తానని ఆయన తెలిపారు.