Girl Eloping With Lover : దారుణం : ప్రేమికుడితో పారిపోయిందని గుండు కొట్టించి మసిపూశారు

గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వాడితో పారిపోయిన ఒక మైనర్ బాలికను కుల పెద్దలు దారుణంగా అవమానించారు.

Girl Eloping With Lover : దారుణం : ప్రేమికుడితో పారిపోయిందని గుండు కొట్టించి మసిపూశారు

Gujarat Woman Tonsured

Girl Eloping With Lover :  గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వాడితో పారిపోయిన ఒక మైనర్ బాలికను కుల పెద్దలు దారుణంగా అవమానించారు. ప్రేమించటమే ఆమె చేసిన నేరం. గుజరాత్, పఠాన్ లోని హర్జీ ప్రాంతంలో నివసించే వాడి తెగకు చెందిన మైనర్ బాలిక(14) అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది.

ఒకరోజు ప్రేమికులిద్దరూ కలిసి గ్రామం విడిచి పారిపోయారు. ఖేడా జిల్లాలోని డాకోర్ లో  తల దాచుకున్న ప్రేమికులను పట్టుకున్న గ్రామస్తులు తమ గ్రామానికి తీసుకువచ్చి.. యువతికి శిరోముండనం చేసి, ముఖానికి…. తలకు నల్లరంగు పూసి చాలా దారుణంగా అవమానించారు. ఆ మైనర్ బాలిక…. వద్దని   ఎంత బతిమిలాడినా వారు విడిచి పెట్టలేదు.

ఆమె ఎంత రోదించినా వారు ఆమెను కనికరించలేదు. ఆమె ఏడుస్తున్నా… ఆమె ముఖానికి నల్లనిరంగు పూస్తూనే ఉన్నారు. మరోకరు ఆమె తలకు నల్లటి  మసి పూయసాగారు. ఆమెకు  ఒంటిమీద గోనెసంచి తొడిగారు.  ఆమె చేసిన పని వల్ల తమ తెగకు చెడ్డపేరు వస్తుందని, భవిష్యత్తులో ఇంకెవరూ అలా చేయరని గ్రామ పెద్ద ఒకరు చెప్పుకొచ్చారు.

అనంతరం వారిద్దరినీ గ్రామంలో ఊరేగించారు. అంతటితో ఊరుకోకుండా అదే సమయంలో గ్రామంలో మరోక వ్యక్తిని వివాహం చేసుకోవాలని బాలికను బలవంతం చేశారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమాచారం తెలుసుకున్న పటాన్ పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా 22 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : AP Covid-19 Update : ఏపీలో కొత్తగా 156 కోవిడ్ కేసులు

వారిపై ఐపీసీ సెక్షన్ 143, 323, 341, 509, మరియు జువైనల్ చట్టాలు, బాల్య వివాహాల చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటాన్ ఎస్పీ సుప్రీత్ సింగ్ గులాటీ చెప్పారు. కాగా బాలిక ప్రేమించిన యువకుడిపై పోక్సో చట్టం కింద. ఐపీసీ సెక్షన్ 363, 376,ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.