కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా.. అలాచేస్తే మూడునెలల్లో ముగ్గురు మాత్రమే మిగులుతరు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటూ రాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు వచ్చినా నేను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Minister Komati Reddy Venkat Reddy : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే కేసీఆర్.. దోపిడీ చేసిన సొమ్ముతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం అంటూ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ 30మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నా.. మేమే వద్దుంటున్నాం. మేం అనుకుంటే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లిల్లీపుట్ అంటావా. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ లా దొంగ పాస్ పోర్ట్ లు చేయలేదు. విటమిన్ డీ తీసుకొని కేసీఆర్ దొంగ దీక్షలు చేశాడు.. మళ్లీ.. చావునోట్లో తలపెట్టి ఉద్యమం చేశానని చెప్పుకుంటావా అంటూ కేసీఆర్ పై మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : యాదగిరి గుట్టను కూడా మేమే కట్టాం.. మరి అక్కడికెందుకు వెళ్తున్నారు?: కేసీఆర్

కవిత జైలుకు పోయినా కేసీఆర్ బుద్ధిమారలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. కవిత జైలుకు పోయాక ఆయనకు మెంటలెక్కింది. అందుకే రేవంత్ బీజేపీలోకి పోతున్నాడని అంటున్నారు. రెండేళ్లయినా కవితకు బెయిల్ రాదు. కవితను చూస్తే జాలేస్తుంది. కేసీఆర్ కుటుంబ దగా వల్ల కవిత బలైందని మంత్రి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కట్టె పట్టుకొని వేటాడతాం అంటున్నాడు.. రేపటి నుంచి మేము వెంటాడుతాం అంటూ మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖం చూసే ధైర్యంలేకనే రెండుసార్లు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అధికారంలోకి ఉన్నప్పుడు అవినీతి చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి అన్నారు.

Also Read : Mallu Ravi : లిల్లీపుట్ మాటలు మానుకో.. మాజీ సీఎం కేసీఆర్‌కు మల్లు రవి స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్ వచ్చి కరువు రాలేదు.. కేసీఆర్ పదేళ్ల పాలన వల్ల కరువు వచ్చిందంటూ మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ వల్ల అందరికీ రైతు బంధు, రుణమాఫీ అమలు కాలేదు. కోడ్ ముగిశాక అన్ని హామీలను నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. జగన్, కేసీఆర్ కుట్రల వల్ల కృష్ణా జలాల పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. కేసీఆర్ మా ప్రభుత్వం కూలిపోతుందని అంటున్నాడు. కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడు. మూడు నెలల్లో ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారు. మా జోలికొస్తే తెలంగాణ భవన్ పునాదుల దగ్గర నుండి లేపేస్తాం అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వా కూల్చేందుకు మీకు ఎన్నిగుండెలు? కేసీఆర్ లాగా రేవంత్ చిల్లర దందాలు చేయలేదని కోమటిరెడ్డి అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటూ రాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు వచ్చినా నేను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు