ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు.. 90రోజుల్లోనే హామీలు అమలు చేస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదవారికి నెలకు వెయ్యి మిగిల్చామని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Minister Komati Reddy Venkat Reddy

Minister Komati Reddy Venkat Reddy : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు.. 90 రోజుల్లోనే హామీలు అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. మాన్యంచెల్క యూపీహెచ్ సీలో ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో బైక్ పై పర్యటించిన మంత్రి.. గృహ జ్యోతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 లక్షల 53 వేల మందికి గృహజ్యోతి కింద మార్చి 1 నుండి ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇస్తు న్నామని చెప్పారు.

Also Read : Telangana BJP : బీజేపీ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితా.. ఆ మూడు స్థానాల్లో అసమ్మతి రాగం

పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్లు మార్చి 11న ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. నల్గొండలో మామిళ్లగూడెంలో 50 ఎకరాల్లో రెండువేల ఇందిరమ్మ ఇళ్లు కట్టబోతున్నామని తెలిపారు. 90రోజుల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ పదేళ్లలో 7లక్షల కోట్లు అప్పులు చేస్తే.. ఆర్థికంగా ఇబ్బందులున్నా హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి చెప్పారు. 40వేల కోట్ల బకాయిలు ఉన్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్స్ ఇస్తున్నామని అన్నారు.

Also Read : Sheep Distribution Scam Case: గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదవారికి నెలకు వెయ్యి మిగిల్చామని మంత్రి అన్నారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ పేద ప్రజల గురించి ఆలోచించలేదని, ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని చూసైనా నేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు