Minister Konda Vs Mla Naini: వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య ధర్మకర్తల మండలి చిచ్చుపెట్టింది. రాజేందర్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచిన ఎమ్మెల్యే అని అన్నారు.
ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరం అన్నారు. దేవాదాయశాఖ మంత్రిగా ఇద్దరికి పదవులు ఇచ్చే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే భద్రకాళి ధర్మకర్తల మండలిలో ఫైనల్ చేశామన్నారు. వాళ్లు పేర్లు ఇవ్వరు, ధర్మకర్తల మండలిని ఫైనల్ చేయనివ్వరు అని మండిపడ్డారు. నా వెంట తిరిగే వాళ్ళు ఎవరికీ ధర్మకర్తల మండలిలో నేను పదవులు ఇవ్వలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.