Minister Ktr Inaugurate Balanagar Flyover
Minister KTR : హైదరాబాద్ బాలానగర్ లో నర్సాపూర్ చౌరస్తా వద్ద రూ. 385 కోట్ల తో నిర్మించిని 6 లేన్ల ఫ్లై ఓవర్ ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంత్రులు తలసాని, మల్లారెడ్డిలతో కలిసి ఈ రోజు ఉదయం ప్రారంభించారు. 24 మీటర్లు వెడల్పుతో, 1.13 కిలోమీటర్లు పొడవు, 26 పిల్లర్లతో ఈ ఫ్లై ఓవర్ నిర్నించారు. హైదరాబాద్ సిటీలోనే 6 లేన్ల ఫ్లై ఓవర్ ఇదే కావటం విశేషం. ఫ్లై ఓవర్ నిర్మాణానికి నాలుగేళ్లు పట్టింది.
2017 ఆగస్టు 21 న మంత్రి కేటీఆర్ ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా బాలానగర్, ఫతేనగర్ డివిజన్లను అనుసంధానిస్తూ నిర్మాణ పనులు మొదలు పెట్టిన అధికారులు మూడు సంవత్సరాల 11 నెలల్లోనే ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేశారు.
వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్ సైతం ఏర్పాటు చేశారు. వాటిలో చక్కటి పూల మొక్కలు నాటారు. ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాదు.. ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్-కూకట్‌పల్లి-అమీర్‌పేట-జీడిమెట్ల వైపునకు రాకపోకలు సాగించే వారికి వెసులుబాటు కలుగుతుంది. కాగా, బాలానగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేసారు.
ఫ్లై ఓవర్ ప్రత్యేకతలు..
* నర్సాపూర్ చౌరస్తాగా ప్రసిద్ధి గాంచిన బాలానగర్ చౌరస్తా వాహనాల రాకపోకలకు ఎంతో కీలకం.
* అటు సికింద్రాబాద్ నుంచి కూకట్‌పల్లి, ఇటు అమీర్‌పేట వైపు నుంచి జీడిమెట్ల వైపు వెళ్లే వాహనాలకు బాలానగర్ కేంద్రంగా ఉంది.
* ఈ ఫ్లై ఓవర్‌ను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించారు.
* భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఈ ఫ్లై ఓవర్ పనులను చేపట్టింది.
* అత్యాధునిక ఫ్రీకాస్ట్ టెక్నాలజీని వినియోగించి 1.13 కిలోమీటర్ల దూరంతో ఇరువైపులా వాహనాలు రాకపోకలు సాగించేలా 6 వరసలతో నిర్మించింది.
* బ్రిడ్జి వెడల్పు 24 మీటర్లు. మొత్తం 26 పిల్లర్లు వేసిన అధికారులు ఆయా పిల్లర్లపై 22 ఆర్సీసీ గడ్డర్లు, 3 స్టీల్ గడ్డర్లు ఏర్పాటు చేశారు.
* ఒక్కో ఆర్సీసీ గడ్డరు పొడవు 30 మీటర్లు.. వెడల్పు 24 మీటర్లు. మూడు స్టీల్ గడ్డర్లు మాత్రం 40 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో స్పాన్‌లు నిర్మించారు.
* మొత్తం రూ.387 కోట్లు వెచ్చించగా అందులో ైప్లెఓవర్ నిర్మాణ పనులకు రూ.70 కోట్లు, కట్టడాల తొలగింపు, విద్యుత్ లైన్ల తరలింపు, తాగునీటి పైప్‌లైన్, రోడ్డు పునరుద్ధరణకు రూ.52 కోట్లు, భూ సేకరణ కోసం రూ.265 కోట్లు ఖర్చు చేశారు.
* ఫ్లై ఓవర్‌పై బీటీ రోడ్డుతో పాటు డివైడర్‌ను సైతం ఏర్పాటు చేసి పూల మొక్కలతో అందంగా ముస్తాబు చేశారు. రాత్రి వేళల్లో వెలుతురు ఉండేలా ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు.