Ktr (3)
KTR instructed students : తెలంగాణ ప్రభుత్వం 90 వేల ఉద్యోగాలు ప్రకటించిన తరువాత మొదటగా మల్లారెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారని.. వారికి అభినందనలు తెలియజేస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ.శాట్ ఛానల్ లో చాలా కంటెంట్ ఉంది.. దానిని వాడుకోవాలని సూచించారు. ఇప్పుడు ఉద్యోగాలకు బాగా పోటీ ఉందని.. బాగా కష్టపడాలన్నారు.
తెలంగాణలో చాలా పరిశ్రమలు వస్తున్నాయని.. అక్కడ కూడా అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్టంలో 60 నుంచి 70వేల వరకు వస్తాయని చెప్పారు.
ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
టాస్క్ ఆధ్వర్యంలో కూడా ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయం చేశామని పేర్కొన్నారు. మెటీరియల్.. ఫుడ్.. కోచింగ్.. ఉందని.. అందరూ ఉపయోగించుకోవాలన్నారు. ఫోన్… సోషల్ మీడియా తక్కువ వాడి ప్రిపరేషన్ పై శ్రద్ధ పెట్టాలన్నారు.