Minister KTR: వెల్‌డన్ కిషనన్నా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వెల్‌డన్ కిషనన్నా అంటూనే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను తీసుకురావడం చాలా బాగుందన్నారు.
- Harishth Thanniru
- Published On : September 14, 2022 / 09:21 PM IST
KTR Tweet
Minister KTR: తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అది మరింత తీవ్రమైన విషయం విధితమే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వెల్‌డన్ కిషనన్నా అంటూనే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను తీసుకురావడం చాలా బాగుంది అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్ లో మూడు ఎలివేటర్లను మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ ట్విటర్ లో స్పందించారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో ప్రారంభించిన మూడు ఎలివేటర్లు బహుశా కిషన్ రెడ్డి తన నియోజకవర్గంలో సాధించిన అతిపెద్ద విజయం అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టు ను తీసుకురావడం చాలా బాగుంది కిషనన్నా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
The 3 elevators inaugurated at Sitaphalmandi Railway station is possibly this BJP MP’s biggest achievement in his constituency
Well done Kishan Anna in bringing such large projects from Govt of India 👏 https://t.co/DtxQtIz65r
— KTR (@KTRBRS) September 14, 2022
తెలంగాణ ప్రజలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కోరారని, కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ ను ప్రారంభించడాన్ని ఎంచుకున్నారంటూ టీఆర్ఎస్ కన్వీనర్ చేసిన ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
