KTR satires On BJP : ‘వాషింగ్ పౌడర్ నిర్మా’లా ఉంది బీజేపీ తీరు : కేటీఆర్

బీజేపీ తీరు వాషింగ్ పౌడర్ నిర్మాలా ఉంది అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.

Minister KTR satires BJP ‘washing powder Nirma’..

Minister KTR satires On BJP : కేంద్రంలోని బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. బీజేపీ తీరు వాషింగ్ పౌడర్ నిర్మాలా ఉంది అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ దేశంలో అధికారంలో ఏం చేసింది చెప్పాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ పార్టీయే అయినా ఆ పార్టీని నడిపించేది మాత్రం గుజరాతీయులేనని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మా ఫోకస్ అంతా 2024 ఎన్నిల్లో గెలుపుపైనే ఉందని తెలిపిన మంత్రి కేటీఆర్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవటానికి యత్నిస్తోందని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

గుజరాత్ ఫేక్ మోడల్ అంటూ విమర్శించిన కేటీఆర్ బీజేపీ తీరు అంతా వాషింగ్ పౌడర్ నిర్మాలా ఉందంటూ సెటైర్ వేశారు. ఎందుకంటే టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ సుజనా చౌదరి, సీఎం రమేష్ లపై ఉన్న కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసులు ఉంటే బీజేపీలోకి జంప్ అయితే కేసులన్నీ మాఫీ అయిపోతాయని బీజేపీ తీరు వాషింగ్ పౌడర్ నిర్మలా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీ వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది అంటూ మంత్రికేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని ఈ విషయాన్ని ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఇదే వాస్తవం అని అన్నారు. దేశ వ్యాప్తం 10వేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఇదీ బీజేపీ తీరు అంటూ విమర్శించారు. బీజేపీ అధిష్టానం తీరు ఎలా ఉందంటే సాక్షాత్తు తమ పార్టీ నేతల ఫోన్లే ట్యాప్ చేసేలా ఉంటాయని ఆఖరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అంటూ విమర్శించారు. ఇటీవలే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. దీని గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ కు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా మద్దతు పెరుగుతోందని తెలిపారు.

Munugode bypoll: రూ.500 కోట్లు ఖర్చు చేస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారం: కేటీఆర్ వ్యాఖ్యలు