Indiramma Housing Scheme : హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇల్లు కావాలా? ఇదిగో ఇలా అప్లయ్ చేసుకోండి..

Indiramma Housing Scheme : హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

Minister Ponguleti Srinivasa Reddy launches the LIG Indiramma Housing Scheme in the Hyderabad CURE Region

Indiramma Housing Scheme : హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ తో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం చేపడుతోందని చేపడుతోందని పొంగులేటి చెప్పారు.

Also Read : Vande Mataram : వందేమాతరం గేయాన్ని అవమానిస్తే ఇక జైలు.. కేంద్రం కీలక బిల్లు!

రాష్ట్ర వ్యాప్తంగా స్థలం వారికి 4.50లక్షల ఇండ్లు ఇచ్చామని, ఆగస్టు నాటికి 2లక్షలపైగా ఇండ్లు పూర్తి కాబోతున్నాయని చెప్పారు. నగరంలోని చార్మినార్, బహదూర్ పురా, ముషీరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించడం జరిగిందని, గరిష్ఠ వార్షికాదాయం రూ.6లక్షలు, ఇల్లు, స్థలం లేకపోవడం ఈ పథకానికి ప్రధాన అర్హతులగా ప్రభుత్వం పేర్కొంది. తొలి విడతలో నియోజకవర్గానికి 500 ప్లాట్‌ల చొప్పున నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

ఇలా అప్లయ్ చేసుకోవాలి.
జులై 21వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మీ సేవా, వాట్సప్, వెబ్‌సైట్‌లలో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు. 16 నియోజకవర్గాల్లో అప్లికేషన్లు చేసుకోవాలని, ఇండ్లులేని వారికి మాత్రమే మొదటి ఫేస్ లో ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి అప్లికేషన్‌కు 10వేల రూపాయలు ఫీజు ఉంటుందని, పారదర్శకంగా ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. 10సంవత్సరాల వరకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు అమ్మడానికి కుదరదన్న మంత్రి.. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చునని తెలిపారు. బ్యాంకులో లోన్ కోసం పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, కుటుంబంలో ఉన్న ఒక్కరికి మాత్రమే ఇండ్లు ఇస్తామని, లాటరీ సిస్టమ్ తో డ్రా తీసి ఇస్తామని తెలిపారు.

ప్రతి ఇంటికి రూ. 11లక్షలు ఖర్చు వస్తుందని మంత్రి తెలిపారు. మాయ మాటలు ఎవ్వరూ నమ్మొద్దు.. ఎవ్వరికీ లంచాలు ఇవ్వొద్దు. అర్హులైన ప్రతిఒక్కరికి ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో డబ్బులు కట్టి మోసపోయిన వారు మా దగ్గరికి వచ్చారు. వచ్చే బోనాల పండుగ నాటికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. వచ్చే బోనాల పండుగను ఇందిరమ్మ ఇండ్ల నుంచి చేసుకుంటారని పొంగులేటి పేర్కొన్నారు.