KCR : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి- కేసీఆర్ కు మంత్రి పొన్నం ఆహ్వానం

డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

KCR : మాజీమంత్రి కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, ఇతర ప్రోటోకాల్ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ఉన్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్.. కేసీఆర్ ను ఆహ్వానించారు.

పాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయోత్సాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ప్రోటోకాల్ అధికారులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వారంతా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నెల 9న సచివాలయంలో ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు ప్రభుత్వ తరపున ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Also Read : మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. వేములవాడ రాజన్న ఆలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన