ponnam prabhakar
Ponnam Prabhakar: ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటికీ పూర్తిస్థాయి క్యాబినెట్ కొలువుదీరలేదు. మంత్రివర్గంలోని బెర్తులన్నీ ఫిలప్ చేయాలని ట్రై చేసినా..ఇంకా రెండు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారి పనితీరుపై కూడా పార్టీ ఓ అంచనాకు వచ్చిందట. ఈ క్రమంలో అటు ప్రభుత్వంలో..కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చేయబోతున్నారట.
లోకల్ బాడీ ఎన్నికల తర్వాత పార్టీ ప్రక్షాళనతో పాటు..రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మార్పులు, చేర్పులు చేయాలనే ఆలోచన చేస్తున్నారట. పార్టీలోని కొందరు వ్యక్తులను ప్రభుత్వంలోకి..ప్రభుత్వంలో ఉన్న కొందరికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలని చూస్తోందట. అందులో భాగంగానే త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. క్యాబినెట్‌లో ఉన్న కొందరు మంత్రుల పనితీరుతో పాటు..ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేస్తారని అంటున్నారు. అందులో భాగంగా ఒక మంత్రి విషయంలో పార్టీలో కీలక చర్చ జరుగుతోంది. (Ponnam Prabhakar)
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. బీసీ సంక్షేమశాఖతో పాటు రవాణాశాఖ బాధ్యతలు చూస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించి మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. పార్టీలో NSUI నుంచి మంత్రి వరకు ఎదిగిన పొన్నం ప్రభాకర్‌కు పార్టీ ఆర్గనైజేషన్ మీద మంచి పట్టుంది. మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్న నాయకుడు కావడంతో ఆర్గనైజేషన్ కోసం ఆయన సేవలను వాడుకోవాలని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు.
Also Read: ఆ ప్లాట్లు అమ్ముకోవద్దని చంద్రబాబు ఎందుకు సూచించారు? రెండో విడత భూములిచ్చేందుకు రైతుల మద్దతు..
అయితే నిన్న మొన్నటి వరకు పొన్నంకు పార్టీ పీసీసీ చీఫ్‌గా అవకాశం కల్పిస్తారని..ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న మహేష్ కూమార్ గౌడ్‌ను ప్రభుత్వంలోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా జరిగింది. మహేష్ కుమార్ గౌడ్‌కు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదా కట్టబెడుతారనే చర్చ కూడా ఉంది. కానీ ప్రస్తుతం పార్టీలో నెలకొన్న సిచువేషన్‌ను బట్టి..పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్‌ను కంటిన్యూ చేస్తారట. కానీ పొన్నం విషయంలో ఆర్టర్నేట్‌గా ఇంకొక కీలక పొజిషన్ ఇవ్వాలని అధిష్టానం అనుకుంటోందట.
పొన్నం ప్రభాకర్‌కు పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టు?
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చి.. ఒక కీలకమైన రాష్ట్రానికి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని చూస్తోందట అధిష్టానం. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో పార్టీ చాలా బలహీనంగా మారింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాష్ట్రాల్లో కూడా హస్తం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
అందుకే పార్టీలో కొత్త రక్తానికి అవకాశం కల్పించి.. కీలక మార్పులు చేయాలని అనుకుంటున్నారట. పాత సీనియర్ నేతలను ఒక్కొక్కరిని తప్పిస్తూ..కొత్తవారికి పనిచేసే నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అంశం పరిశీలనలో ఉందట. ఇక పొన్నం ప్రభాకర్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తూ వచ్చిన వ్యక్తి కావడం..హిందీ భాషపై మంచి పట్టు ఉండటంతో..ఏదో ఒక రాష్ట్రానికి పార్టీ ఇంచార్జ్‌గా పంపిస్తారని అంటున్నారు. నార్త్ స్టేట్స్ ఒక కీలకమైన రాష్ట్రానికి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ఇప్పటికే తెలంగాణకు చెందిన వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ వంటి నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చింది ఏఐసీసీ. ఇక లేటెస్ట్‌గా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా అవసరం ఉన్న చోటుకు పంపించి ఆయన సేవలను వాడుకోవాలని భావిస్తోందట. ఈ ఎక్స్‌ఫర్ మెంట్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.