Hyderabad : హైదరాబాద్ వాసులకు రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్.. మంత్రి అఫీషియల్ ప్రకటన

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే హైదరాబాద్ (Hyderabad) నగరంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించామని మంత్రి పొన్నం అన్నారు.

Hyderabad ration cards

Hyderabad ration cards : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించేలా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంపై దృష్టిసారించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నగరంలో రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ ఇచ్చారు.

Also Read: Danam Nagender: జూబ్లీహిల్స్ టికెట్ నాకివ్వండి..! దానం నాగేందర్ అదిరిపోయే స్కెచ్..! అక్కడ పోటీ చేస్తాననడానికి కారణమిదే..!

గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే హైదరాబాద్ నగరంలో కొత్తగా 55వేల రేషన్ కార్డులను పంపిణీ చేశామని మంత్రి పొన్నం చెప్పారు.

రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు హైదరాబాద్‌లో ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడే రేషన్ తీసుకోవచ్చునని తెలిపారు. పట్టణ పథకాల కింద నగరంలో ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుండి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం కోరారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, డ్రైనేజీ, సీసీ రోడ్లతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం అన్నారు. ఈ పనులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నందున త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

హిమాయత్ సాగర్, మంజీర, నిజాం సాగర్, గోదావరి ఫేజ్-1, కృష్ణ ఫేజ్-1, 2 పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే నిర్వహించి హైదరాబాద్‌కు తాగునీటికి తీసుకురావడం జరిగిందన్నారు. గోదావరి ఫేజ్-2 కింద నగరానికి మరో 20 టీఎంసీల తాగునీటికి తెచ్చేందుకు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.