Telangana : ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : రేణుక చౌదరికి మంత్రి పువ్వాడ సవాల్..

నేను కూడా మాట్లాడగలను....నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు మీ గబ్బు చరిత్ర ఏంటో అందరికి తెలుసు,ఖమ్మం జిల్లాలో గిరిజనుడికి టిక్కెట్టు ఇప్పిస్తానని చెప్పి మోసంచేసి దోచుకున్న చరిత్ర మీది అంటూ మండిపడ్డారు.

Puvvada Ajay ..Renuka chaudhary

Telangana : కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రేణుకా చౌదరిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. రేణుకా చౌదరికి సవాల్ విసిరారు. ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళంలో పాల్గొన్న మంత్రి అజయ్ రేణుక చౌదరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేణుకా చౌదరిలాగా నేను కూడా మాట్లాడగలను….నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు మీ గబ్బు చరిత్ర ఏంటో అందరికి తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో గిరిజనుడికి టిక్కెట్టు ఇప్పిస్తానని చెప్పి మోసంచేసి దోచుకున్న చరిత్ర రేణుకాచౌదరిది అంటూ మండిపడ్డారు. ఖమ్మం ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఖమ్మం జిల్లాకు ఏంచేశావో చెప్పగలరా? ఖమ్మం ప్రజలకు గుక్కెడు మంచినీరు ఇచ్చావా?అంటూ ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చనివారు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. రేణుక చౌదరి, రేవంత్ రెడ్డిలకు సంస్కారం లేదంటూ దుయ్యబట్టారు మంత్రి అజయ్. ఈ సందర్బంగా మీకు దమ్ముంటే ఖమ్మంలో నాపై పోటీ చేయండీ..చేసి గెలిస్తే నేను రాజకీయ సన్యాయం తీసుకుంటా అంటూ సవాల్ విసిరారు. రేణుక చౌదరి నీకు దమ్ముంటే రా చూసుకుందాం..మీడియా సమక్షంలో నిజనిర్దారణకు నేను సిద్దం…రా అవినీతిపై చర్చిద్దాంరా అంటూ సవాల్ విసిరారు.

తెలుగు రాష్ట్రాల చరిత్ర తిరగరాస్తూ కేసీఆర్ మూడోసారి ముఖ్య మంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేసిన మంత్రి అజయ్ మంత్రిగా మూడున్నరేళ్ళుగా జిల్లా ప్రజలకోసం కష్టపడుతున్నానని అన్నారు.  కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నానని కోటి రూపాయల నిత్యావసరాల్ని పంచానని..ఆ సమయంలో మీరెక్కడున్నారు? కనీసం కాకరకాయ కూడా పంచలేదుగా అంటూ ఎద్దేవా చేశారు.