Sabitha Indra Reddy
Sabitha Indra Reddy Reacted Modi : వరంగల్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన విమర్శలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేయటానికే తెలంగాణకు వచ్చారని ఎద్దేవా చేశారు. యూనివర్సిటీల ఉమ్మడి రిక్రూట్ మెంట్ బిల్లు ఎక్కడ ఆగిందో తెలియదా..? ఆపింది మీరే… తిరిగి మాట్లాడుతున్నది మీరేనని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చే పాలన చేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై విమర్శలా? అని ప్రశ్నించారు.
మోదీకి తెలంగాణ అంటే ఎప్పటికి ద్వేషమేనని, తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపాలన చేస్తూ దేశానికే ఒక బాట చూపుతుంటే కళ్ళు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అని వెల్లడించారు. మోదీ విభజన హామీలు మర్చిపోయి విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. విలువైన ప్రాజెక్టులు గుజరాత్ కు, మామూలివి తెలంగాణకా అని నిలదీశారు.
RS Praveen Kumar : సిర్పూర్ నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా : ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్
రాష్ట్ర పునర్ విభజన హామీ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి మాత్రం మొండిచేయి చూపించారని విమర్శించారు. వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి ఎందుకు నెరవేర్చలేదన్నారు. “మీరు కేసీఆర్ గారిపై ఎంత ద్వేషం ప్రదర్శిస్తే.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు” అని తెలిపారు. “కాజీపేటకు రిపేరు ఫ్యాక్టరీ ఇచ్చి, గుజరాత్ కు రూ.20వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు…మీరు దేశానికా ప్రధానా, గుజరాత్ కా అని ప్రశ్నించారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం నేటికి రాలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాకు గతంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వ పథకాలను దేశం అంతా స్వాగతిస్తుంటే.. మోదీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రైతు బంధు, మిషన్ భగీరథ లాంటి పథకాలను కాపీ కొట్టి, పేర్లు మార్చి అమలు చేస్తుంది మీరు కాదా అని నిలదీశారు.
KA Paul : కేసీఆర్ బీజేపీతో గల్లిలో కొట్లాట.. ఢిల్లీలో దోస్తీ : కేఏ పాల్
మోదీ.. ఏటా ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసింది మీరు కాదా అని అడిగారు. ఐఐఎంలు దేశంలో 7 మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఐఐటీలు దేశమంతా 7 ఇస్తే తెలంగాణకు గుండుసున్నా పెట్టారని పేర్కొన్నారు. దేశం మొత్తంలో ఐఐఐటీలో 16 ఇస్తే తెలంగాణకు రిక్త హస్తం చూపారని చెప్పారు.
దేశంలో ఎన్ఐడీలు నాలుగు ఇస్తే తెలంగాణకు ఇచ్చింది జీరో అని తెలిపారు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే… తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాలు 84 ఇస్తే, తెలంగాణకు ఒక్కటీ మంజూరు కాలేదన్నారు. ఏమిటి ఈ వివక్ష అని ప్రశ్నించారు. తెలంగాణ నుండి టాక్స్ లు కావాలి.. కానీ, కేటాయింపులు ఉండవా అని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు.