KA Paul : కేసీఆర్ బీజేపీతో గల్లిలో కొట్లాట.. ఢిల్లీలో దోస్తీ : కేఏ పాల్
కుటుంబ రెడ్ల పాలనకు తాను వ్యతిరేకమని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి పాలు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పాడు.. కానీ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు.

KA Paul (4)
Farmers Joined Praja Shanti Party : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు చేశారు. కేసీఆర్ బీజేపీతో గల్లిలో కొట్లాడుతున్నాడని.. ఢిల్లీలో మాత్రం దోస్తీ చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మోదీ మాటలతో మభ్య పెడుతున్నారని విమర్శించారు. ఈ దేశం నాశనం కావాడానికి కారణం కాంగ్రెస్ అని.. 54 సంవత్సరలు అధికారంలో ఉన్నారని పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 50వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.
ఎంత కాలం ఈ దోపిడీ పాలన.. బీసీలు అధికారం చేపట్టాలన్నారు. 60 శాతం బీసీలు ఏకం కావాలని పేర్కొన్నారు. బీసీలు అందరూ ప్రజా శాంతి పార్టీలో చేరాలని కోరారు. ఈ దొంగలను, దోపిడీ పాలన, కుటుంబ పాలనను నమ్మకండి అంటూ పిలుపునిచ్చారు. కుటుంబ రెడ్ల పాలనకు తాను వ్యతిరేకమని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి పాలు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పాడు.. కానీ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు.
Nagul Meera : సజ్జల రామకృష్ణారెడ్డి నేరస్థులను కాపాడుతున్నారు.. నాగుల్ మీరా సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లను ఓడించి, ప్రజా శాంతి పార్టీని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. శనివారం కామారెడ్డి రైతులు ప్రజా శాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ వారికి ప్రజా శాంతి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ 50 లక్షల మంది ప్రజా శాంతి పార్టీ లో జాయిన్ అయ్యారని వెల్లడించారు. కామారెడ్డి రైతులు తమ పార్టీలో జాయిన్ కావడం మంచి పరిణామం అని అన్నారు. రైతులు తమ పార్టీలో జాయిన్ అయినట్లు విద్యార్థులు, యువత కూడా జాయిన్ కావాలని కోరారు.
చదువుకున్న వాళ్ళు తనకు ఓటు వేయరని పేర్కొన్నారు. లోక్ సత్తా పార్టీ నేత జయ ప్రకాష్ నారాయణకు చదువుకున్న వాళ్ళు ఓటు వేయడం లేదని ఆయన రాజకీయాలను వదిలి వెళ్లి పోయారని తెలిపారు. తన కోరిక మేరకు జయ ప్రకాష్ నారాయణ తమ పార్టీలో జాయిన్ కావాలని కోరారు. కామారెడ్డి రైతుల కోసం తాను పోరాటం చేశానని పేర్కొన్నారు.
తాను అధికారంలోకి వస్తే ప్రతి రైతుకూ ఏకరానికి రూ.20వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అలాగే నిరుద్యోగులకు 6వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లలో ప్రజా శాంతి పార్టీని గెలిపించండి అని కేఏ పాల్ కోరారు.