Nagul Meera : సజ్జల రామకృష్ణారెడ్డి నేరస్థులను కాపాడుతున్నారు.. నాగుల్ మీరా సంచలన వ్యాఖ్యలు

విశాఖ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వ్యవహారం పోలీస్ కమీషనర్ రంగంలోకి దిగేంతవరకు తెలియలేదని పేర్కొన్నారు. స్వర్ణలత వ్యవహారం పోలీసు వ్యవస్థ తలదించుకునేలా ఉందని చెప్పారు.

Nagul Meera : సజ్జల రామకృష్ణారెడ్డి నేరస్థులను కాపాడుతున్నారు.. నాగుల్ మీరా సంచలన వ్యాఖ్యలు

Nagul Meera

Updated On : July 8, 2023 / 7:13 PM IST

Nagul Meera Sensational Comments : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరాలు చేసేవారిని గాడిలో పెట్టాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి నేరస్థులను కాపాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. నాడు పోలీసంటే నాలుగో సింహం అన్న స్వర్ణలత బండారం నేడు బయటపడిందన్నారు. ఈ మేరకు శినివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

విశాఖ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వ్యవహారం పోలీస్ కమీషనర్ రంగంలోకి దిగేంతవరకు తెలియలేదని పేర్కొన్నారు. స్వర్ణలత వ్యవహారం పోలీసు వ్యవస్థ తలదించుకునేలా ఉందని చెప్పారు. తనే డీలింగ్ కు పిలిచి తనే సినిమా ఫక్కీలో డబ్బులు దోచుకోవడం విచిత్రంగా ఉందన్నారు.

YS Sharmila : రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వైఎస్సార్ నమ్మారు : వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్

జగన్ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దిగజారిందని విమర్శించారు. నాయకుల మాట వినకుంటే పై అధికారులతో ఎక్కడికి ట్రాన్స్ ఫర్ చేస్తారో అని పోలీసులు భయపడుతున్నారని వెల్లడించారు. ఇలాంటి ప్రభుత్వం ఇక మనుగడ సాగించడం కష్టమని తెలిపారు.