Bangaru Bonam
Talasani Dance : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా ముఖ ద్వారాల ప్రారంభోత్సవ వేడుక ఈ రోజు జరిగింది. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు బంగారు బోనంతో అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ తీన్ మార్ స్టెప్పులు వేసి అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు.
Talasani Dance
మంత్రి శ్రీనివాస యాదవ్ తన స్టెప్పులతో అందరినీ అలరించారు. అక్కడున్న వారంతా మంత్రి డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయారు. ఈ బోనాల పండుగ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలతో మహిళల నృత్యాలు, పోతురాజులు, కొలాటం ప్రదర్శనలు భక్తులను అలరించాయి.