Minister Uttam Kumar : L&T ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం.. తప్పు చేసినవారిపై చర్యలు తప్పవంటూ వార్నింగ్

L&T ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Minister Uttam Kumar Reddy : L&T ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మేడిగడ్డ పునరుద్దరణ పనులు చేయలేమని L&T రాసిన లేఖపై చర్చించారు. ఈ సందర్భంగా  L&T ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంత పెద్ద మేడిగడ్డ ప్రాజెక్టులో నాణ్యత లేకుండా పనులు చేస్తారా..? అంటూ నిలదీశారు. అధికారులకు ఓ లేఖ ఇచ్చి తమ ప్రమేయం లేదని..తప్పించుకోవాలనుకుంటే ఊరుకోబోము అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాధనాన్ని వృథా చసి ప్రాజెక్టు పిల్లర్లు దెబ్బతినడానికి కారణమైనవారిని వదిలిపెట్టబోము అంటూ హెచ్చరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్నీలను కూడా పిలిచి మాట్లాడాలని ఆదేశించారు. తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని వదిలిపెట్టం : మంత్రి పొంగులేటి

కాగా..బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ..బాధ్యతలు చేపట్టాక అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఆయా శాఖ మంత్రులు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని..అన్ని శాఖల్లోను అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు . ఆర్థిక అవకతవకలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవని మంత్రులు హెచ్చరిస్తున్నారు.

దీంట్లో భాగంగా నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా..L&T ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు