Minister Uttam Kumar Reddy : అన్ని శాఖల్లోను అప్పులే.. అయినా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ..బియ్యం సరఫరా వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.

Minister Uttam Kumar Reddy

Minister Uttam Kumar Reddy..Civil Supply : పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లయ్ శాఖ పనితీరును సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ..బియ్యం సరఫరా వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో మనం మరింత పారదర్శకంగా ఉండాలని సూచించారు. 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని.. కానీ ప్రజలు వాటిని ఉపయోగించుకుంటున్నారా..?లేదా అనేది గమనించాలన్నారు.కిలో రూ.39 రూపాయలు ఖర్చుతో ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందన్నారు. కానీ ప్రజలకు ఇచ్చే సరఫరాను కేవలం మొక్కుబడిగా కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని..బియ్యం పేదలకు ఎలా ఉపయోగకరమైన పథకంగా ఉంటుందో మనం అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో బియ్యం లబ్దిదారుల నుంచి వివరాలు సమగ్రంగా సేకరించాలన్నారు.ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండాలన్నారు.పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినే విధంగా ఉండాలి తప్ప దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు.రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు జరుగుతుంది.. అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో రైతుల నుంచి సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also Read : తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్ రెడ్డి

సివిల్ సప్లై శాఖపై సమీక్ష తరువాత మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతు..రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ.. సివిల్ సప్లై శాఖ..రైతుల నుంచి ప్రోక్యూర్మెంట్ చేసే శాఖ అని అన్నారు. అన్ని శాఖల్లోను అప్పులున్నాయన్నారు. అయినా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. తాము ఇచ్చిన గ్యారెంటీల్లో భాగంగా రూ.5000లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.క్వాలిటీ రేషన్ సప్లై.. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుందని.. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలన్నారు. లబ్ధిదారుల నుంచి పీడీఎస్ రైస్ డైవర్ట్ అయ్యిందన్నారు.

లబ్ధిదారులకు తినగలిగే బియ్యాన్ని ఇవ్వాలన్నారు. రూ.2కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులున్నారని తెలిపారు.ప్రోక్యూర్మెంట్ కు సివిల్ సప్లై అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం ఈ శాఖకు ఆర్థిక శాఖకు సహాయం చేయక పోవడంతో రూ.56 వేల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల రూ.18వేల కోట్ల విలువైన ప్యాడి రైస్ మిల్లర్ల వద్ద ఉందని..దీనిపై ఏం చేయాలనేది క్యాబినెట్ లో చర్చిస్తామని తెలిపారు. 1.17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లై వద్ద ఉందని..సివిల్ సప్లై కార్పొరేషన్ రూ.11వేల కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో లోపాలున్నాయని విమర్శించారు. ఉన్న రేషన్ కార్డులో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటలేదన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ ఉందని..ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదని అన్ని అప్పుల్లో ఉన్నాయన్నారు.

Also Read :  టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదించని గవర్నర్ తమిళిసై