Janardhan Reddy : టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదించని గవర్నర్ తమిళిసై
ప్రశ్నాపత్రాల లీక్ కేసు విషయంలో జనార్ధన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలని డీవోపీటీకి గవర్నర్ సిఫారసు చేసినట్లు తెలుస్తో్ంది.

Janardhan Reddy resignation
Janardhan Reddy Resignation : టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. జనార్ధన్ రెడ్డి రాజీనామా ఆమోదంపై రాజ్ భవన్ స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్ తమిళిసై నిన్న సోమవారం మధ్యాహ్నం పుదుచ్చేరి వెళ్లారు. జనార్ధన్ రెడ్డి తన రాజీనామాను డీవోపీకి పంపినట్లు సమాచారం.
ప్రశ్నాపత్రాల లీక్ కేసు విషయంలో జనార్ధన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలని డీవోపీటీకి గవర్నర్ సిఫారసు చేసినట్లు తెలుస్తో్ంది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. జనార్ధన్ రెడ్డి తన రాజీనామాను డీవోపీకి పంపినట్లు సమాచారం.
సోమవారం(డిసెంబర్11, 2023)న టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమవేశానికి చైర్మన్ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు.. వంటి పలు అంశాలపై రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్పీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అయితే, సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాత జనార్ధన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్ తమిళిసైకి పంపారు. తన రాజీనామాను డీవోపీకి పంపినట్లు సమాచారం. కాగా, 2021 మే9న టీఎస్పీఎస్సీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.