Site icon 10TV Telugu

Uttam Kumar Reddy: స్వతంత్ర భారత్‌లో అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం.. సభ నిర్ణయం మేరకు చర్యలు- మంత్రి ఉత్తమ్ సంచలనం

Minister Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత్ లో అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మంత్రి ఉత్తమ్ అన్నారు. బ్యారేజ్ కు, డ్యామ్ కు తేడా తెలియకుండా ప్రాజెక్ట్ కట్టారని విమర్శలు గుప్పించారు.

మాకు కక్ష సాధింపులు లేవు, పారదర్శకంగా ముందుకెళ్తున్నాం అని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే కాళేశ్వరం కమిషన్ నివేదికపై సభలో చర్చ పెట్టామని వివరించారు. కాళేశ్వరం రిపోర్ట్ వేస్ట్ అంటూ బీఆర్ఎస్ వాళ్లు కోర్టుకు వెళ్లారని, అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పెట్టొద్దని కోర్టుకెళ్లారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు.

హరీశ్ రావు, ఈటల రాజేందర్, కేసీఆర్ ను కమిషన్ విచారించిందని తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ ను కాంగ్రెస్ కమిషన్ అని ఎలా అంటారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఇల్లీగల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు.

CWC అనుమతి రాకముందే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని చెప్పారు. నిజాలను ఎవరు దాచి పెడుతున్నారో మీరే ఆలోచించాలన్నారు. కాళేశ్వరం తప్పిదాలకు పూర్తి బాధ్యత కేసీఆర్ దే అని కమిషన్ తేల్చిందన్న మంత్రి ఉత్తమ్.. సభ నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చ.. కోట్లు పోసి కట్టినా నో యూజ్ అన్న మంత్రి ఉత్తమ్

 

 

Exit mobile version