Kaleshwaram Commission Report: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చ.. కోట్లు పోసి కట్టినా నో యూజ్ అన్న మంత్రి ఉత్తమ్
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.

Kaleshwaram Commission Report: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ ప్రారంభమైంది. వాయిదా తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో చర్చను ప్రారంభించారు. కమిషన్ దర్యాఫ్తునకు సంబంధించిన వివరాలను సభ్యులకు అందించారు. తెలంగాణకు ఇది చాలా బాధాకరమైన రోజు అని మంత్రి ఉత్తమ్ వాపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 87వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. 21వేల కోట్లతో కట్టిన మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజ్ లు 20 నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు గుండె లాంటి మేడిగడ్డ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. 3 ఆనకట్టల ప్రణాళిక, నిర్మాణంలో పూర్తి లోపాలు, తప్పిదాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. అంచనాల తయారీ, పరిపాలన అనుమతుల్లో లోపాలున్నాయని చెప్పారు. ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతుల్లోనూ లోపాలు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సహేతుకం కాదని నివేదికలో తెలిపారు. అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజ్ లు నిర్మించారని నివేదికలో తెలిపారు. కేసీఆర్ నిర్ణయం ప్రకారమే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మించారని నివేదిక ఇచ్చారు. ఆనకట్టల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్ట్ విధానం సరికాదని పీసీ ఘోష్ నివేదిక పేర్కొంది.