September Changes: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్, సిల్వర్ హాల్ మార్కింగ్ నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వరకు.. సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్..

ఆదాయపు పన్ను దాఖలు గడువు మొదలు ఆభరణాల హాల్ మార్కింగ్ వరకు సెప్టెంబర్ నెలలో అనేక ముఖ్యమైన మార్పులు అమలవుతాయి. ఇందులో కొన్ని డబ్బుతో ముడిపడి ఉన్న రూల్స్ ఉన్నాయి.

September Changes: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్, సిల్వర్ హాల్ మార్కింగ్ నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వరకు.. సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్..

Updated On : August 31, 2025 / 4:41 PM IST

September Changes: ఆగస్ట్ నెల అయిపోయింది. సెప్టెంబర్ నెల వచ్చేస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పలు అంశాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. అవి ఏంటో, ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం..

సెప్టెంబర్ నెలలో అనేక మార్పులు వస్తాయి. ఆర్థికపరమైన కొత్త నియమాలు అమల్లోకి వస్తాయి. కొత్త రూల్స్ లో కొన్ని మొదటి రోజు నుంచే అమలవుతాయి. ఇవి చాలా మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి.

ఆదాయపు పన్ను దాఖలు గడువు మొదలు ఆభరణాల హాల్ మార్కింగ్ వరకు సెప్టెంబర్ నెలలో అనేక ముఖ్యమైన మార్పులు అమలవుతాయి. ఇందులో కొన్ని డబ్బుతో ముడిపడి ఉన్న రూల్స్ ఉన్నాయి. ఇవి దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. కొత్త రూల్స్ ఏంటి, అవి ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతాయో తెలుసుకుందాం.

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ గడువు..
రిటర్న్స్ ఫైల్ చేయడానికి నాన్ ఆడిట్ ట్యాక్స్ పేయర్లకు ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ మరింత సమయం ఇచ్చింది. ఇప్పటివరకు రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31వ వరకు సమయం ఉండేది. దాన్ని సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. అకౌంట్లు ఆడిట్ చేయాల్సి ఉన్న వారికి ఆ గడువు అక్టోబర్ 31వ తేదీగా ఉంటుంది.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి మారేందుకు లాస్ట్ ఛాన్స్..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎంపిక చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు. వాస్తవానికి గడువు తేదీ జూన్ తో ముగిసింది. తక్కువ స్పందన కారణంగా గడువును పొడిగించారు. UPS అనేది NPS కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టబడిన పెన్షన్ వ్యవస్థ.

ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు..
సెప్టెంబర్ 1 నుంచి రివార్డ్స్ పాయింట్స్ కి సంబంధించి ఎస్బీఐ మార్పులు చేసింది. డిజిటల్ గేమింగ్, గవర్న్ మెంట్ వెబ్ సైట్లు, ఎంపిక చేసిన వ్యాపారుల లావాదేవీలపై కార్డ్ హోల్డర్లు ఇకపై పాయింట్లు సంపాదించలేరు. ఇది మిలియన్ల మంది వినియోగదారులను ప్రభావితం చేయచ్చు.

వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ మస్ట్..
సెప్టెంబర్ నుండి వెండి ఆభరణాలకు హాల్‌ మార్కింగ్ తప్పనిసరి. సిల్వర్ మార్కెట్‌లో స్వచ్ఛతను నిర్ధారించడం, కస్టమర్లకు రక్షణ కల్పించడం ఈ చర్య లక్ష్యం.

స్పీడ్ పోస్ట్‌లో రిజిస్టర్డ్ పోస్ట్ విలీనం..
సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్‌తో ఇండియా పోస్ట్ విలీనం చేస్తుంది. అన్ని రిజిస్టర్డ్ మెయిల్స్ ఇక నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా డెలివరీ అవుతాయి. దీంతో ప్రత్యేక రిజిస్టర్డ్ పోస్ట్ కేటగిరీ ముగిసినట్లే.

Also Read: చెయ్యి/కాలు తీసేయాల్సి రావొచ్చు.. ట్రంప్ హెల్త్ పై సంచలనం.. అమెరికా డాక్టర్ చెప్పిన కీలక విషయాలు..