పేదలకు అందుబాటులో : హైదరాబాద్‌ లో ఒకేసారి 8 డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాలు

eight diagnostics centers in Hyderabad : తెలంగాణలో రోగ నిర్థారణ పరీక్షలు సామాన్యులకు మరింత చేరువలోకి వచ్చాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ పథకంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌ నగరంలో ఒకేసారి ఎనిమిది కేంద్రాలను మంత్రులు ప్రారంభించనున్నారు. లాలాపేట, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట, బర్కాస్‌, జంగంపేట, పానీపురా, పురానాపూల్‌, సీతాఫల్‌మండిలలో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో అధునాతన రోగనిర్థారణ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటి వరకు ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వంటి రేడియాలజీ పరీక్షలు కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల సామాన్యులకు వైద్య ఖర్చులు తగ్గనున్నాయి.