Sriram Sagar : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు అంశంపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

Sriram Sagar : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు అంశంపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పర్యావరణ ఉల్లంఘనలపై ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని కేంద్రం అడిగింది. 15 రోజుల్లో సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి గడువు విధించింది కేంద్రం.

Night Food : రాత్రి సమయంలో ఆ ఆహారం తింటే షుగర్ , గుండె జబ్బులు వచ్చే చాన్స్!..

చెన్నై ఎన్జీటీ బెంచ్ లో విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఉల్లంఘించినట్లు ఎన్జీటీకి తెలిపింది కేంద్రం. అనుమతులు లేకుండా ప్రాజెక్టులో మార్పులు చేసినట్లు ఎన్జీటీకి నివేదించింది కేంద్రం. గౌరవెల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి పిటిషన్ పై ఎన్జీటీ విచారణ చేపట్టింది.

Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..

కాగా, శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు దగ్గర నిర్మాణ పనులు చేపట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది చెన్నై ఎన్జీటీ బెంచ్.

ట్రెండింగ్ వార్తలు