Night Food : రాత్రి సమయంలో ఆ ఆహారం తింటే షుగర్ , గుండె జబ్బులు వచ్చే చాన్స్!..

వీటి వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తుతాయట. బరువు పెరగటం, శరీరంలో కొలెస్ట్రాల్ పెరగటం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Night Food : రాత్రి సమయంలో ఆ ఆహారం తింటే షుగర్ , గుండె జబ్బులు వచ్చే చాన్స్!..

Snack Food

Night Food : ఆధునిక జీవన విధానంలో తీసుకునే ఆహారంలో అనేక మార్పులు సంతరించుకుంటున్నాయి. రాత్రి వేళల్లో సమయానికి ఆహారం తీసుకోక పోవటం, ఒక వేళ ఆహారం తీసుకున్నా త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినకపోవటం ఇలాంటి వన్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే చాలా మంది ఈ విషయాలను చాలా లైట్ గా తీసుకుంటున్నారు. కాని ఒక్కోసారి ఇవే ప్రాణాల మీదకు తెచ్చిపెడతాయని ఏమాత్రం గ్రహించరు. ఆహారాన్ని ఎప్పుడూ సరైన వేళల్లో తీసుకోవాలి. లేకుంటే అజీర్తి, రక్తహీనత, పోషకాహార లోపం, గుండెల్లో మంట, కడుపు నొప్పి, బరువు, కండరాలు, ఎముకలు, నిద్ర సమస్యలు వస్తాయి. సరైన ఆహారం, సరైన సమయానికి తీసుకోవడం వల్ల మనిషి ఆయుష్షు పెరుగుతుంది. దీర్ఘకాలిక రోగాలు సైతం దరిచేరవు. ఇటీవలికాలంలో నైట్‌షిఫ్ట్ ఉద్యోగమనేది సర్వ సాధారణంగా మారిపోయింది. వేళాపాళ లేకుండా తీసుకునే ఆహారపదార్ధాలు అనారోగ్యానికి దారితీస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఏ ఆహారపదార్ధాలు తినకూడదో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

రాత్రివేళల్లో నిద్ర పట్టకపోవటం వల్ల ఏదోఒకటి తినాలన్న ఆలోచన కలుగుతుంది. దీంతో వివిధ రకాల చిరుతిళ్లు, ఆహారపదార్ధాలు అదేపనిగా తినేస్తుంటారు. ఇలా తినటం వల్ల నిద్రలేమి కారణంగా సరిగా జీర్ణకాక కడుపులో ఇబ్బంది కరంగా మారుతుంది. రాత్రి సమయంలో అసలు చిరుతిళ్లు జోలికి వెళ్ళకపోవటమే బెటర్ అంటున్నారు నిపుణులు. వీటి వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తుతాయట. బరువు పెరగటం, శరీరంలో కొలెస్ట్రాల్ పెరగటం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.

ఏమితినాలనుకున్నా పగటి పూటే తినటం వల్ల తీసుకున్న ఆహారం శరీరానికి పడుతుంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తీసుకోవల్సి వస్తే బిస్కెట్స్, చిప్స్, హాట్ లేదా స్వీట్స్ వంటి చిరు తిళ్ల జోలికి వెళ్ళకుండా ఉండటమే బెటర్. రాత్రి సమయంలో లిక్విడ్స్ అధికంగా తీసుకోవటం వల్ల ప్రయోజనం కలుగుతుంది. జీర్ణక్రియలు సాఫీగా సాగుతాయి. పిజ్జా, బర్గర్ వంటి స్పైసీ ఆహారాన్ని అస్సలు తినొద్దు. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. రాత్రి వేళ పెరుగుతో భోజనం చేస్తే శ్లేష్మం ఏర్పడుతుంది.

రాత్రి సమయంలో మాంసాహారాన్ని అసలు తీసుకోకూడదు. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రొటీన్స్, కొవ్వులు త్వరగా జీర్ణం కావు. ఇలాంటి వాటి వల్ల జీర్ణప్రక్రియకు విఘాతం కలుగుతుంది. అంతేకాకుండా టీ, కాఫీలను అదేపనిగా రాత్రి వేళల్లో సేవించటం వల్ల అది క్రమేపి రాత్రిళ్లు నిద్రపట్టకపోవటానికి దారితీసే అవకాశం ఉంటుంది. తీపి పదార్ధాలు, పులుపు వస్తువులను రాత్రి సమయంలో అసలు తినకుండా ఉండటమే మంచిది. పులుపు వస్తువులు రాత్రి సమయంలో తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.