Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..

శానిటైజర్ వాడకంతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ శానిటైజర్ల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకుండా పాటించడం అత్యంత అవసరం అంటున్నారు.

Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..

Sanitizers

Sanitizers : కరోనావైరస్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు వైద్య నిపుణులు పలు జాగ్రత్తలు చెప్పారు. అందులో ముఖ్యమైన వాటిలో మూడు జాగ్రత్తలు ఉన్నాయి. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. బయటికి వెళ్లినప్పుడు భౌతికదూరం పాటించాలి. ఇక వ్యక్తిగత శుభ్రత తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అంటే ముఖ్యంగా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

నోటికి మాస్కులు పెట్టుకోవడం, ఎప్పుడూ లేని విధంగా తరచూ చేతులు శుభ్రపరచుకోవడం.. ఇవన్నీ మన జీవితంలో ఓ భాగమయ్యాయి. ఈ క్రమంలో చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లు వచ్చాయి. క్రమంగా వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వీటి వల్ల చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు తొలగిపోతాయి. అందుకే జనాలంతా శానిటైజర్లను విరివిగా వాడేస్తున్నారు.

Mahesh Co-operative Bank : బ్యాంకుపై భారీ సైబర్ దాడి.. ఏకంగా రూ.12కోట్లు మాయం

అదే సమయంలో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ శానిటైజర్ల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకుండా పాటించడం అత్యంత అవసరం అంటున్నారు వైద్య నిపుణులు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.

* శానిటైజర్లతో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి.
* శానిటైజర్లలో 60 నుంచి 90శాతం ఆల్కహాల్ ఉంటుంది. అందుకే దీన్ని రాసుకున్న వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్లి పనులు చేయకూడదు.
* సాధారణంగా ఆల్కహాల్‌కు మండే స్వభావం ఉంటుంది. కాబట్టి చేతికి శానిటైజర్లు రాసుకున్న వెంటనే కాకుండా అది చేతుల్లోకి పూర్తిగా ఇంకిపోయి, ఆరిన తర్వాతే వంటింట్లో పనులు మొదలు పెట్టడం ఉత్తమం.
* చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

* శానిటైజర్లు కేవలం చేతులకు అంటుకున్న బ్యాక్టీరియా, వైరస్‌లను మాత్రమే నాశనం చేస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
* దుమ్ము, జిడ్డు మరకలు అంటుకున్నప్పుడు పొరపాటున కానీ శానిటైజర్లు వాడొద్దు. ఆ అవశేషాలు చేతుల్లో పేరుకుపోయే ప్రమాదం ఉంది.
* చిన్న పిల్లలు శానిటైజర్లను ఉపయోగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* నోట్లో వేలు పెట్టుకునే పిల్లలకు శానిటైజర్లు వాడొద్దు.

COVID : కరోనాపై సైంటిస్టుల తీపి కబురు

ఓవర్ గా యూజ్ చేయొద్దు..
* శానిటైజర్‌ మన చేతులపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఫలితంగా ఎన్నో రకాల అనారోగ్యాలు దరిచేరవన్న మాట వాస్తవమే. అయితే కొన్ని సందర్భాల్లో మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా (మంచి బ్యాక్టీరియా)ను కూడా ఈ ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు నాశనం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ఎక్కువ వాడితే శానిటైజర్లకు నశించని బ్యాక్టీరియాలు తయారవుతాయి.
* శానిటైజర్లను అధిక మోతాదులో ఉపయోగిస్తే కొన్ని రోజుల తర్వాత చర్మం పొడిబారే ప్రమాదం ఉంది. దీనికి చెక్‌ పెట్టడానికి మాయిశ్చరైజర్లను
కూడా వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో- వీలైనంత వరకు చేతులను నీటితో శుభ్రం చేసుకోవడమే మంచిది.

సో..ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సాధ్యమైనంత వరకు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.