Mahesh Co-operative Bank : బ్యాంకుపై భారీ సైబర్ దాడి.. ఏకంగా రూ.12కోట్లు మాయం

మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగింది. సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు కొట్టేశారు. బ్యాంక్ సర్వర్ ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు..

Mahesh Co-operative Bank : బ్యాంకుపై భారీ సైబర్ దాడి.. ఏకంగా రూ.12కోట్లు మాయం

Mahesh Co Operative Bank

Updated On : January 24, 2022 / 8:29 PM IST

Mahesh Co-operative Bank : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ లో భారీ చోరీకి పాల్పడ్డారు. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగింది. సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు కొట్టేశారు. బ్యాంక్ సర్వర్ ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు బ్యాంకు అకౌంట్లలోని రూ.12కోట్లకు పైగా నగదును కాజేశారు.

Watching TV : అధిక సమయం టీవీ చూసే అలవాటుందా?… అయితే జాగ్రత్త?

హ్యాక్ చేసిన సర్వర్ నుంచి 120 అకౌంట్లకు నగదు బదిలీ చేశారు. బ్యాంకు మెయిన్ సర్వర్ పై సైబర్ అటాక్ జరిగినట్లు గుర్తించిన బ్యాంకు యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. బ్యాంకు సర్వర్ ని ఎక్కడి నుంచి హ్యాక్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Chittoor Dead Body : ముళ్లపొదల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతదేహం.. అసలేం జరిగింది?

సైబర్‌ క్రిమినల్స్ దోపిడీలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ వ్యక్తుల బ్యాంకు ఖాతాలపై దాడి చేసి దోచుకున్న నేరగాళ్లు.. ఇప్పుడు ఏకంగా బ్యాంక్‌ సర్వర్‌నే హ్యాక్‌ చేశారు. బ్యాంకు టెక్నికల్ సిబ్బంది స్పందించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహేష్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12కోట్లు కాజేశారని వార్త సంచలనంగా మారింది. బ్యాంకు సర్వర్లకే భద్రత లేకపోతే ఎలా? అనే అంశం ఆందోళనకు గురి చేస్తోంది.