COVID : కరోనాపై సైంటిస్టుల తీపి కబురు

కరోనా విజృంభిస్తున్న సమయంలో... శాస్త్రవేత్తలు ఓ తీపికబురు చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే తీరును వివరించే ఆర్‌‌వ్యాల్యూ తగ్గుముఖం పట్టినట్టు... ఐఐటీ పరిశోధకులు...

COVID : కరోనాపై సైంటిస్టుల తీపి కబురు

India Covid

Scientists Good News Over COVID : కరోనా విజృంభిస్తున్న సమయంలో… శాస్త్రవేత్తలు ఓ తీపికబురు చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే తీరును వివరించే ఆర్‌‌వ్యాల్యూ తగ్గుముఖం పట్టినట్టు… ఐఐటీ పరిశోధకులు చెప్పారు. జనవరి 14 నుంచి 24 మధ్య ఆర్‌-వాల్యూ 1.57గా నమోదైనట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నాటికి దేశంలో కేసుల సంఖ్య తారాస్థాయికి చేరుకుంటుందని పరిశోధకులు తెలిపారు. జనవరి 7 నుంచి 13 మధ్య ఆర్‌-వాల్యూ 2.2గా, జనవరి ఒకటి నుంచి ఆరో తేదీ మధ్య 4గా, డిసెంబరు 25 నుంచి 31 మధ్య 2.9గా ఉన్నట్లు తెలిపారు. క్రమంగా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందంటున్నారు.

Read More : Andhra Pradesh PRC : పీఆర్సీ వివాదం.. హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

ముంబయిలో ఆర్‌-వాల్యూ 0.67గా, ఢిల్లీలో 0.98గా, చెన్నైలో 1.2గా, కోల్‌కతాలో 0.56గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ముంబయి, కోల్‌కతాలో కొవిడ్‌ విజృంభణ ఇప్పటికే తారాస్థాయికి చేరుకుందని మద్రాస్ ఐఐటీ పరిశోధనలకు వెల్లడించారు. రీ ప్రొడక్షన్ నెంబర్ క్రమంగా తగ్గుతూ ఉందంటే… వేరియంట్ తీవ్రత బయటపడినట్టే అంటున్నారు పరిశోధకులు. మరోవైపు ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ వేరియంట్… కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరుకుందని ఇన్సాకాగ్ సంస్థ ప్రకటించింది. వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించిన ఈ సంస్థ… దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి సామాజిక వ్యాప్తి స్థాయికి వచ్చేసినట్టు నిర్ధారించింది. దేశవ్యాప్తంగా 50 వేల శాంపుల్స్‌ను ఇన్సాకాగ్‌ సంస్థ విశ్లేషించింది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దాని కన్నా దేశీయంగా వ్యాప్తే అధికంగా ఉంద‌ని ఇన్సాకాగ్ పేర్కొంది.