CM KCR visit constituencies
CM KCR Visit Constituencies : ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ముమ్మర ప్రచారం చేస్తోంది. సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 27న పాలేరు, మహబూబాబాద్ తోపాటు వర్ధన్నపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండటంతో ప్రచారంలో జోరు పెంచాలని చూస్తున్నారు.
సీఎం కేసీఆర్ అభ్యర్థుల కోసం అక్టోబర్ వరకు మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం ఎల్లుండి (26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ముందుంగా నిర్ణయించిన ప్రకారం 26వ తేదీన అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలనుకున్నారు. అయితే నాగర్ కర్నూల్ లో నిర్వహించాలనుకున్న బహిరంగ సభను వనపర్తిలో ఏర్పాటు చేశారు.
YS Sharmila : టార్గెట్ రేవంత్ రెడ్డి.. పాలేరుతో పాటు కొడంగల్ నుంచి వైఎస్ షర్మిల పోటీ?
నాగర్ కర్నూల్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనడం లేదు. అక్టోబర్ 26వ తేదీన అచ్చంపేట, వనపర్తి, మునుగోడు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. అదే విధంగా అక్టోబర్ 27వ తేదీన పాలేరు, స్టేషన్ ఘన్ పూర్ లో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సివుంది. అయితే, తాజాగా షెడ్యూల్ మార్పుల్లో పాలేరు యధావిధిగా ఉంది.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం స్థానంలో మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఒక్కో రోజు మూడు మూడు నియోజకవర్గాల్లో జరుగనున్న బహిరంగ సభల్లో కేసీఆర్పా ల్గొననున్నారు. రెండో విడత ప్రచారం ప్రారంభంలోనే సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేశారు. 26వ తేదీన మూడు బహిరంగ సభల్లో, 27వ తేదీన మూడు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని, ప్రసంగించనున్నారు.
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు కంటిన్యూగా సీఎం కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేసే వరకు
వరుసుగా బహిరం సభలు నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు తొలి విడత పూర్తయ్యేలా పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. అందులో భాగంగా 26, 27 వ తేదీల్లో జరిగే బహిరంగ సభల్లో స్వల్ప మార్పులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.