YS Sharmila : టార్గెట్ రేవంత్ రెడ్డి.. పాలేరుతో పాటు కొడంగల్ నుంచి వైఎస్ షర్మిల పోటీ?

కొడంగల్ నుంచి పోటీపై రెండు రోజుల్లో షర్మిల నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. YS Sharmila

YS Sharmila : టార్గెట్ రేవంత్ రెడ్డి.. పాలేరుతో పాటు కొడంగల్ నుంచి వైఎస్ షర్మిల పోటీ?

YS Sharmila Targets Revanth Reddy

YS Sharmila Targets Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రగిలిపోతున్నారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనాన్ని రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు అని భావిస్తున్న షర్మిల.. కొడంగల్ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నుంచి పోటీ చేయడం ద్వారా ఓట్లను చీల్చాలనే యోచనలో ఉన్నారు షర్మిల. తాను పోటీలో ఉంటే తాను గెలవకున్నా రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమని షర్మిల భావిస్తున్నట్లుగా సమాచారం. కొడంగల్ నుంచి పోటీపై రెండు రోజుల్లో షర్మిల నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

హీట్ ఎక్కిన తెలంగాణ పాలిటిక్స్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రోజురోజుకి పాలిటిక్స్ హీటెక్కిపోతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల చేసిన ఆలోచన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పాలేరుతో పాటు కొడంగల్ లో పోటీ చేయాలనే యోచనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో షర్మిల చర్చించినట్లు సమాచారం.

Also Read : తెలంగాణకు వస్తున్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యే అవకాశం..పొత్తులు,సీట్లపై క్లారిటీ వచ్చేనా..?

రేవంత్ రెడ్డిపై రగిలిపోతున్న షర్మిల..
వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ లో విలీనంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిశారు షర్మిల. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం అంశం ఓ కొలిక్కి వచ్చిందని అనుకుంటున్న తరుణంలో.. షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. వైఎస్ఆర్ టీపీ విలీనంపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

షర్మిల పార్టీ విలీనానికి కాంగ్రెస్ పెద్దలు సుముఖత చూపలేదు. అయితే, దీనికి కారణం రేవంత్ రెడ్డి అని షర్మిల భావిస్తున్నారు. తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడ్డారని షర్మిల అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్న షర్మిల.. రేవంత్ రెడ్డిపై కొడంగల్ లో పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే యోచనలో ఆమె ఉన్నట్లు సమాచారం.

Also Read : టార్గెట్ కాంగ్రెస్.. హస్తం పార్టీని కట్టడి చేసేలా కేసీఆర్ వ్యూహం

రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యం..
గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఈసారి కూడా రేవంత్ రెడ్డి గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని భావిస్తున్న షర్మిల.. ఇలాంటి పరిస్థితుల్లో తాను కనుక రేవంత్ రెడ్డిపై పోటీ చేస్తే రేవంత్ రెడ్డి గెలుపు అవకాశాలను ప్రభావితం అవుతాయని షర్మిల అనుకుంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డిపై పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించాక పాలేరుతో పాటు కొడంగల్ లో పోటీ చేసే అంశంపై షర్మిల ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాను కొడంగల్ లో గెలిచే పరిస్థితి లేకున్నా రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా కొడంగల్ లో పోటీకి దిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

రెండు రోజుల్లో షర్మిల కీలక ప్రకటన..
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని ఇప్పటికే షర్మిల నిర్ణయించుకున్నారు. పాలేరుతో పాటు మరో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని షర్మిల అనుకుంటున్నారు. మిర్యాలగూడ, సికింద్రాబాద్, కొడంగల్.. ఈ మూడింటిలో ఒక చోట నుంచి షర్మిల పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పాలేరుతో పాటు తాను పోటీ చేయబోయే రెండో స్థానంపై ఒకటి రెండు రోజుల్లో షర్మిల అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.