Site icon 10TV Telugu

Miss World 2025: సోనూసూద్ కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్

Miss World 2025: అందాల భామ ఎవరో తేలిపోనుంది. ప్రపంచ సుందరిని ఎంపిక చేసే మిస్ వరల్డ్ కాంటెస్ట్ హైదరాబాద్ హైటెక్స్ లో కనుల విందుగా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల నుంచి అందాల భామలు పోటీపడ్డారు. ఇండియా నుంచి నందిని గుప్తా పోటీ పడ్డారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు జడ్జీలుగా జూలియా మోర్లీ, సోనూ సూద్, రానా దగ్గుబాటి, మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, జయేశ్ రంజన్, మానుషి చిల్లర్, సుధారెడ్డి ఉన్నారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముద్దుగుమ్మలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

ప్రముఖ నటుడు, గొప్ప మానవతావాది సోనూసూద్ కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్ దక్కింది. నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా సోనూ సూద్ ఆ పురస్కారం అందుకున్నారు.

మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ కు అతిరథ మహారధులు తరలివచ్చారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఈవెంట్ లో తళుక్కుమన్నారు. ఫైనల్స్‌ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి దంపతులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు దంపతులు సందడి చేశారు.

 

Exit mobile version