Balka Suman
Balka Suman: హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయి పనిచేసిన తీరును ప్రజలు గమనించారని అన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంపై ప్రజలు మాట్లాడుకుంటున్నారని, బీజేపీ గెలుపుకోసం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు గుర్తించాలన్నారు.
ఢిల్లీలో శత్రువులుగా ఉంటూ.. రాష్ట్రంలో మిత్రులుగా మారి కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేయడం సిగ్గుచేటని అన్నారు బాల్క సుమన్. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేకే రెండు పార్టీలు కలిశాయని అన్నారు సుమన్. బండి సంజయ్ చెబుతున్న ట్రిపుల్ ఆర్‌లో చివరి ’ఆర్‘ రేవంత్ రెడ్డేనని విమర్శించారు.
హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయి భారతీయ జనతా కాంగ్రెస్‌గా మారాయని, టీఆర్ఎస్ 20 ఏళ్లలో ఎన్నో విజయాలను చూసిందని, విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము అని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో నైతిక విజయం టీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు.