అతడే కారణం అంటూ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు

Lasya Nanditha: లాస్యను ఆకాశ్ బలవంతంగా తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. ఇప్పటికే..

దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. లాస్య మృతికి ఆమె పీఏ, డ్రైవర్ ఆకాశ్ కారణమని అంటున్నారు. లాస్యను ఆకాశ్ బలవంతంగా తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఆకాశ్‌పై పోలీసులకు లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు చేశారు. ఆకాశ్‌పై కేసు నమోదు చేసిన పటాన్ చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అతడు కారును నిర్లక్ష్యంగా నడిపాడని లాస్య సోదరి ఇప్పటికే ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆకాశ్ నుంచి ఇప్పటికే పటాన్‌చెరు పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇచ్చాడు. ప్రమాదం ఎలా జరిగిందో తనకు అర్థం అవ్వట్లేదంటూ ఆకాశ్ చెప్పాడు.

లాస్య భోజనం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వేతుకుంటూ వెళ్లామని అన్నాడు. దర్గా నుండి హైదరాబాద్ చేరుకుని.. లాస్య కార్లో ఉన్న తన అక్క కూతుర్ని ఇంకో కార్లో ఎక్కించామన్నాడు. తాము పఠాన్ చెరు వైపు బయలుదేరామని, యాక్సిడెంట్ టైంలో తన మైండ్ బ్లాంక్ అయ్యిందని చెప్పాడు. నిర్లక్షంగా, అతివేగంగా నడపడం వల్లే కారు ప్రమాదం జరిగిందని పఠాన్ చెరు డీఎస్పీ అంటున్నారు.

Also Read : టీడీపీ-జనసేన అభ్యర్థులను చూస్తుంటే..: ఏపీ మంత్రుల కామెంట్లు

ట్రెండింగ్ వార్తలు