Hyderabad : మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇవ్వటమేంటీ? : ఎమ్మెల్యే రాజాసింగ్

మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇవ్వటమేంటీ? అంటూ హైదరాబాద్ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ధర్మం కోసం పనిచేయటమే నా లక్ష్యం అని దాని కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోను అంటూ వ్యాఖ్యానించారు.

Hyderabad : మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇవ్వటమేంటీ? : ఎమ్మెల్యే రాజాసింగ్

Mangal Hot Police Notices to MLA Rajasingh

Updated On : January 31, 2023 / 10:11 AM IST

Mangal Hot Police Notices to MLA Rajasingh  : మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇవ్వటమేంటీ? అంటూ హైదరాబాద్ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ధర్మం కోసం పనిచేయటమే నా లక్ష్యం అని దాని కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోను అంటూ తనదైన శైలిలో రాజాసింగ్ వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒకవర్గం మనోభావాలను కించపర్చే విధంగా వీడియో పోస్టు చేసినందుకు ఆయనపై పీడీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసిన చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉండి విడుదల అయిన విషయం తెలిసిందే. పలు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఎటువంటి రెట్టగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్​కు మంగళ్ హాట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్రలోని జనవరి 29న ముంబయి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నోటీసులు జారీ చేసినట్లు మంగళ్​హాట్ పోలీసులు తెలిపారు. ఆ ర్యాలీలో రాజాసింగ్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు షరతులు ఉల్లంఘించారని అందుకే ఈ నోటీసులు ఇచ్చామని ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇవ్వటమేంటీ? అంటూ హైదరాబాద్ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.