ప్రధాన ప్రతిపక్ష నేతలు ప్రజలకు వాస్తవాలు చెప్పండి.. అవాస్తవాలు కాదు: బలమూరి వెంకట్

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం వెనుక కేటీఆర్ ఉన్నాడు..ఇంట్లో కూర్చొని ఇదంతా చేస్తున్నారంటూ బలమూరి వెంకట్ ఆరోపించారు.

MLC Balamuri Venkat

MLC Balamuri Venkat : పదేండ్లు గడీల పాలన సాగింది. సీఎం రేవంత్ వచ్చాక గడీల పాలనకు స్వస్తి పలికామని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాపాలన వచ్చింది. ఏసీలకు అలవాటు పడ్డ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నెలకు లక్షలు ఇస్తున్నారు. గతంలోనే క్రిశాంక్ ఫేక్ జీవోలు తయారు చేసి జైల్లోకి పోయాడని వెంకట్ అన్నారు.

Also Read : ఆయనకు ఎంపీ సీటు ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది: చంద్రబాబు

టీఎస్ కు బదులు టీజీగా మార్చినందుకు వేలకోట్లు ఖర్చు అవుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు పేపర్లు, జీవో కాపీలు తయారు చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ అన్నారు. టీఎస్ నుండి టీజీగా మార్చినందుకు 4,630 కోట్లు ఖర్చు అవుతుందని ప్రచారం చేస్తున్నారు . దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా, డీజీపీ వద్ద తేల్చుకుందాం రండి అంటూ బీఆర్ఎస్ నేతలకు వెంకట్ సవాల్ విసిరారు.

Also Read : చంద్రబాబు చేతిలో చెయ్యేసి పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం ..

ప్రధాన ప్రతిపక్ష నేతలు ప్రజలకు వాస్తవాలు చెప్పండి.. తప్పులు కాదు. ప్రజాదర్భార్ ఉంది.. ఏదైనాఉంటే అక్కడికి వచ్చి చెప్పొచ్చు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం వెనుక కేటీఆర్ ఉన్నాడు..ఇంట్లో కూర్చొని ఇదంతా చేస్తున్నారంటూ ఆరోపించారు. బాధ్యత గల జర్నలిస్టులు ఏదైనా తప్పుజరిగే హెచ్చరించండి అని బలమూరి వెంక ట్ అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు