Kadiyam Srihari : రాజయ్య అందుకు కట్టుబడి ఉంటానని చెప్పారు.. స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తాం..

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని, అందరం కలిసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి బీఆర్ఎస్‌ను గెలిపించుకుంటామని కడియం అన్నారు.

MLC Kadiam Srihari

BRS MLA Candidate Kadiyam Srihari: స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బుధవారం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం, ఓట్లకోసం కాంగ్రెస్ మాట్లాడుతుంది. మతిలేని, నీతిలేని రాజకీయాలు కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్నాయని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని కడియం శ్రీహరి దీమా వ్యక్తం చేశారు. రాజయ్య సహకరిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. కేసీఆర్ నిర్ణయానికి రాజయ్య కట్టుబడి ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. అందరం కలిసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి బీఆర్ఎస్‌ను గెలిపించుకుంటామని కడియం అన్నారు.

KCR Strategy: గులాబీ బాస్ టాప్‌గేర్.. కేసీఆర్ మార్కు చాణక్యం.. ఒకే దెబ్బతో అంతా సెట్!

నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాలు, సర్వేలు చేసిన తరువాత సీఎం కేసీఆర్ టిక్కెట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగాప్రజలు సీఎం కేసీఆర్ పాలన పట్ల సంతోషంగా ఉన్నారు. మూడవ సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం. ప్రజలు కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నారని కడియం శ్రీహరి అన్నారు.

Santosh Kumar : బీఆర్ఎస్ ను వీడనున్న మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్.. తిరిగి కాంగ్రెస్ గూటికి?

గత రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య స్థానంలో కడియం శ్రీహరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. తనకు టికెట్ ఇవ్వకపోవటం పట్ల రాజయ్య స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని, ఆయన ఆదేశాలను పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఒక్కరూ ముందుకు పోవాలని అన్నారు. తన స్థాయికి తగ్గకుండా అవకాశం కల్పిస్తానని, ఇప్పటికంటే ఉన్నతంగా చూస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని రాజయ్య అన్నారు.