MLC Kavitha : నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నేత చిన్నూ గౌడ్.. ఎమ్మెల్సీ కవితపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కవితకు వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పారాయన. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతంలో స్కూబా డైవింగ్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
సముద్రపు అడుగున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ ప్రదర్శించారు. ఆ విధంగా నాయకురాలిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారాయన. ఈ వెరైటీ బర్త్ డే విషెస్.. అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ వినూత్న పుట్టిన రోజు శుభాకాంక్షలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read..MLC Kavitha : లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు-తేల్చి చెప్పిన కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పుట్టిన రోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్నూ గౌడ్ మాత్రం వెరైటీగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానం చాటుకున్నారు. సముద్రపు అంచుల్లోకి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.