Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్

పెద్ద ఎత్తున వాహనాలు, గుర్రపు బగ్గీలు, ఒంటెలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో..

mahesh kumar goud

టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. గన్‌పార్క్ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా గాంధీ భవన్‌కు బయలుదేరారు. పెద్ద ఎత్తున వాహనాలు, గుర్రపు బగ్గీలు, ఒంటెలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో భారీ ర్యాలీ జరిగింది.

అలాగే, మహేశ్ కుమార్ గౌడ్ నివాసంలో ఆయనకు టీటీడీ వేదపండితుల ఆశీర్వచనాలు ఇచ్చారు. మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ 4వ పీసీసీ అధ్యక్షుడు. కాగా, గాంధీ భవన్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. మొత్తం 350 మందికి ఆహ్వానం అందగా వారిలో చాలా మంది పాల్గొన్నారు.

మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానం

  • ఉమ్మడి ఏపీలో 2013, 14లో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన మహేశ్ కుమార్ గౌడ్
  • యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్‌యూఐలో పని చేసిన మహేశ్
  • 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి
  • కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్
  • ప్రస్తుతం టీపీీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్
  • ఎమ్మెల్సీగానూ ఉన్న మహేశ్ కుమార్ గౌడ్

Roja : ఏపీ ప్రభుత్వంపై రోజా విమర్శలు.. వాటిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్