Jeevan Reddy : మళ్లీ కేసీఆర్ వస్తే.. ఒంటి మీద బట్ట కూడా మిగలదు- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరిక

సాగునీటి ప్రాజెక్టులే కాదు సంక్షేమ కార్యక్రమాలు కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. నాలుగేళ్లుగా రేషన్ కార్డు జారీ ప్రక్రియ నిలిపివేశారు. Jeevan Reddy - CM KCR

Jeevan Reddy - CM KCR (Photo : Google)

Jeevan Reddy – CM KCR : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ప్రసంగంపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన ప్రసంగంలో 10 శాతం కూడా నిజాలు లేవన్నారు. జగిత్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. నాయకుల ప్రసంగాలు, సందేశం.. ప్రగతికి నివేదికగా భావిస్తాం అన్నారు. కానీ, ఇవాళ ఖిల్లాలో కొప్పుల ఈశ్వర్ ప్రసంగించిన ప్రగతిలో 10 శాతం అన్నా కరెక్ట్ గా ఉన్నాయా చెప్పాలన్నారు. 60 కోట్లతో మొదలైన రోళ్లవాగు ప్రాజెక్ట్ అంచనా వ్యయం 130 కోట్లకు చేరినా ఇంకా పనులు పూర్తి కాలేదన్నారు.

భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సూరమ్మ చెరువు 60 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ, ఇంతవరకు కొలిక్కి రాలేదు. సదర్ మట్ 600 కోట్లు, పోతరం పేద చెరువు 10 కోట్లతో పూర్తి కావాల్సి ఉంది. సాగునీటి ప్రాజెక్టులే కాదు సంక్షేమ కార్యక్రమాలు కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. గృహలక్ష్మి పథకానికి అర్హతగా రేషన్ కార్డు ముఖ్యం. కానీ, నాలుగేళ్లుగా రేషన్ కార్డు జారీ ప్రక్రియ నిలిపివేశారు.

Also Read..Congress Candidates First List : తెలంగాణలో ఎన్నికల ఫీవర్.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

2018 డిసెంబర్ లో రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చాక ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టింది లేదు. ఖాళీ స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానకి 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 3 లక్షలు ఇస్తామంటున్నారు. దళితులతో పాటు బీసీలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తున్నది దేశమంతా అనుకరిస్తుందట? ఈ మాట వింటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీ ఒంటి మీద కట్టు బట్ట కూడా మిగలదు. భూములన్నీ అమ్మేస్తాడు” అని హెచ్చరించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Also Read..BRS Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. 78మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

ట్రెండింగ్ వార్తలు